Corona: దేశంలో కరోనా మరోసారి వ్యాప్తి వేగవంతమవుతోంది. ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన తాజా నివేదిక ప్రకారం.. 24 గంటల్లో 29 మంది మరణించారు. దీంతో కరోనాతో మరణించిన వారి సంఖ్య 5,31,329 కు పెరిగింది. మృతుల్లో ఎక్కువ మంది కేరళకు చెందిన వారు. 

Corona: దేశంలో కరోనా (Corona) మరోసారి కోరలు చాస్తోంది. కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. గత వారం అదుపులోనే ఉందనుకున్న మహమ్మారి మరోసారి కోరలు చాస్తోంది. తాజాగా కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ (Ministry of Health) వెల్లడించిన వివరాల ప్రకారం.. గత 24 గంటల్లో దేశంలో 10,112 కొత్త కోవిడ్ పాజిటివ్ రోగులు నమోదయ్యారు. దీంతో యాక్టివ్ కేసులు సంఖ్య 67,806 కు పెరిగింది. ఆదివారం ఉదయం 8 గంటలకు ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన నివేదిక ప్రకారం.. 24 గంటల్లో 29 మంది మరణించారు. ఈ కేసులతో కరోనా మొత్తం మరణాల సంఖ్య 5,31,329 కు పెరిగింది. మృతుల్లో ఎక్కువ మంది కేరళకు చెందిన వారు ఉన్నారు.

మరణాల రేటు 1.18 శాతం

దేశంలో కరోనా నుంచి కోలుకుంటున్న రోగుల శాతం 98.66గా ఉందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. క్రియాశీల కేసుల సంఖ్య 67,806. ఇది మొత్తం ఇన్ఫెక్షన్‌లో 0.15 శాతంగా ఉంది. భారతదేశంలో ఇప్పటివరకు 4,42,92,854 మంది రోగులు కరోనా నుండి కోలుకున్నారు. ఇది కాకుండా.. మరణాల రేటు 1.18 శాతంగా ఉన్నట్టు మంత్రిత్వ శాఖ తెలిపింది. మరోవైపు మంత్రిత్వ శాఖ వెబ్‌సైట్ ప్రకారం, దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ డ్రైవ్ కింద ఇప్పటివరకు 220.66 కోట్ల డోస్‌ల COVID-19 వ్యాక్సిన్‌లు ఇవ్వబడ్డాయి.

ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన నివేదికల ప్రకారం.. గత నాలుగు రోజులుగా కేసులు నిరంతరం 10,000 దాటుతున్నాయి. మంత్రిత్వ శాఖ నివేదిక ప్రకారం.. ఆదివారం భారతదేశంలో క్రియాశీల రోగుల సంఖ్యలో క్షీణత నమోదైంది, ఇది ఖచ్చితంగా కొంత ఉపశమనం కలిగించే ఆంశమే.. గత నాలుగు రోజుల నివేదికల ప్రకారం.. అతి తక్కువ సంఖ్యలో పాజిటివ్ రోగులు ఆదివారం వచ్చారు. ఆదివారం 10,112 కేసులు రాగా.. శనివారం క్రియాశీల రోగుల సంఖ్య 12,193 గా నమోదైంది. ఈ గణాంకాలు పరిశీలిస్తే..జాతీయ COVID-19 రికవరీ రేటు 98.66 శాతంగా నమోదైంది. ఇది ఖచ్చితంగా ఉపశమనం కలిగించే ఆంశమేనని చెప్పవచ్చు.