పశ్చిమ బంగా: కోల్ కతాలో దారుణం చోటు చేసుకుంది. వందేళ్ల పండు ముసలమ్మపై కామంతో కళ్లు మూసుకుపోయిన ఓ 20 ఏళ్ల యువకుడు అత్యాచారానికి ఒడిగట్టాడు. కాటికి కాళ్లు చాచిన ఆమె ఓపిక లేక నిద్రపోతుంది. నిద్రపోతున్న సమయంలో కామాంధుడు ఆమెపై అత్యాచారనికి తెగబడ్డాడు. తన అమ్మమ్మ, నానమ్మ వయసున్న ఆ వృద్ధురాలిపై జాలిపడాల్సింది పోయి అతి క్రూరంగా అత్యాచారానికి పాల్పడ్డాడు. మానవత్వం మంటకలిసిన ఈ ఘటన పశ్చిమబంగాలోని నదియా జిల్లాలో చోటు చేసుకుంది. 

వివరాల్లోకి వెళ్తే నదియా జిల్లాకు చెందిన వందేళ్ల భామ నిద్రపోతుంది. అర్థరాత్రి బామ్మ నిద్రిస్తున్న సమయంలో అభిజిత్ అనే కామాంధుడు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. విషయాన్ని గమనించిన కుటుంబ సభ్యులు యువకుడిని పట్టుకున్నారు. దేహశుద్ధి చేసి చక్ ధా పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసి విచారణ చేపట్టిన పోలీసులు నిందితుడు గంగా ప్రసాద్ పూర్ కు చెందిన అభిజిత్ గా గుర్తించారు. సోమవారం రాత్రి జరిగిన ఈ ఘటన చోటుచేసుకోగా..ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.  

నిందితుడుని అరెస్ట్ చేసిన పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. దీంతో కోర్టు నిందితుడికి రిమాండ్ విధించింది. అత్యాచారానికి గురైన వృద్ధురాలిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. చికిత్స అనంతరం ఆమెను డిశ్చార్జ్ చేశారు వైద్యులు. 
 
వరుస అత్యాచార ఘటనలతో పశ్చిమ బంగా వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రెండు రోజుల క్రితం జల్పైగురి జిల్లాలో భూవివాదం పరిష్కరించుకుందామని పిలిచి మహిళపై అత్యాచారం చేసి ఆమె ప్రయివేటు భాగాలను ఇనుపరాడ్లతో గాయపరిచిన ఘటన మరువకముందే వృద్ధురాలిపై అత్యాచారం ఘటన వెలుగులోకి రావడంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.