చెన్నైలో తనను అవమానించిన మూడో భర్త ముందు తాను పతివ్రత నిరూపించుకునేందుకు ఓ తల్లి  కసాయిగా మారింది. తన రెండో భర్తకు పుట్టిన ఆడబిడ్డను కడతేర్చింది. చెన్నైలో ఆదివారం రాత్రి చోటు చేసుకున్న ఈ ఘటన అందరినీ విస్మయపరిచింది. వివరాల్లోకి వెళితే… తూతుకూడికి చెందిన పాల్ వణ్ణన్ కొన్నేళ్ళ క్రితం భార్య జయలక్ష్మితో చెన్నైకి వచ్చాడు. వీరికి నిత్య అనే కుమార్తె ఉంది. ఇది మొదటి పెళ్లి కథ...

చెన్నై : ఇదో విచిత్ర వింత పెళ్లిళ్లు, పతివ్రతా నిరూపణల గోల.. చివరికి వీరి మధ్యలో అభం, శుభం తెలియని చిన్నారి హతమయ్యింది. మూడు పెళ్లిళ్లు చేసుకున్న ఓ మహిళ తాను పతివ్రతనేనని నిరూపించుకోవడానికి రెండో భర్తకు పుట్టిన కూతురిని మంటల్లో కాల్చింది. వినడానికే ఒళ్లు గగుర్పొడిచే ఈ ఘటన తమిళనాడులో చోటు చేసుకుంది. 

చెన్నైలో తనను అవమానించిన third husband ముందు తాను పతివ్రత నిరూపించుకునేందుకు ఓ mother కసాయిగా మారింది. తన రెండో భర్తకు పుట్టిన ఆడబిడ్డను కడతేర్చింది. చెన్నైలో ఆదివారం రాత్రి చోటు చేసుకున్న ఈ ఘటన అందరినీ విస్మయపరిచింది. వివరాల్లోకి వెళితే… తూతుకూడికి చెందిన పాల్ వణ్ణన్ కొన్నేళ్ళ క్రితం భార్య జయలక్ష్మితో చెన్నైకి వచ్చాడు. వీరికి నిత్య అనే కుమార్తె ఉంది. ఇది మొదటి పెళ్లి కథ...

ఆ తర్వాత కొన్నాళ్లకు జయలక్ష్మి భర్త, కూతురును వదిలిపెట్టి మరిది దురైరాజ్ తో ముంబైకి పారిపోయింది. అక్కడ మరిదిని second marriage చేసుకుంది. వీరికి ఓ కూతురు పుట్టింది. ఆ కుమార్తె పవిత్ర (10). పెళ్లి చేసుకున్న తరువాత కొద్ది కాలానికి.. అంటే దాదాపు ఏడేళ్ల క్రితం జయలక్ష్మిని వదిలిపెట్టి దూరైరాజు పత్తా లేకుండా elope అయ్యాడు. ఇది రెండో పెళ్లి కథ... 

రెండో భర్త పారిపోయిన తర్వాత కొద్దిరోజులు ముంబైలో ఉన్న జయలక్ష్మి అక్కడ ఏం చేయాలో తెలియక.. కుమార్తె పవిత్రను తీసుకుని చెన్నై తిరువొత్తియూరుకు వచ్చేసింది. ఇక్కడికి వచ్చాక.. ఖాళీగా ఉంటే గొడవే ఉండేది కాదు.. కానీ పెళ్లిళ్లకు అలవాటు పడ్డ ప్రాణం కదా.. అందుకే అక్కడ ఓ లారీ డ్రైవర్ ను మూడో వివాహం చేసుకుంది. ఇది మూడో పెళ్లి కథ...

పెళ్లాం పెళ్లికి ముందు ఎవరినైనా ప్రేమించిందంటేనే అనుమానించే లోకం.. ఇక ముందు రెండు పెళ్లిళ్లు.. ఇద్దరు కూతుర్లంటే మూడో భర్త అనుమానించడం సహజమే కదా.. అయితే ఈ అనుమానం మొదట్లో లేదు.. వీరి మూడో పెళ్లి అన్యోన్యతకు గుర్తుగా.. కుమార్తె భానుప్రియ (6), కుమారుడు భూపాలన్ (5) ఉన్నారు. కాగా ఇటీవల జయలక్ష్మి మూడో భర్త పద్మనాభన్ ఆమెపై అనుమానంతో గొడవ పడడం మొదలు పెట్టారు.

ఈ క్రమంలోనే ఆదివారం రాత్రికూడా భర్తతో గొడవ అయ్యింది. దీంతో మూడో భర్త పద్మనాభన్ ఆదేశాల మేరకు నిద్రలో ఉన్న రెండో భర్త దురైరాజ్ కు పుట్టిన పవిత్రపై కిరోసిన్ పోసి నిప్పు అంటించింది. ఆ నిప్పు మీద ప్రమాణం చేసి తాను ఏ తప్పు చేయలేదని ప్రతిజ్ఞ చేసింది. ఆ తర్వాత కాసేపటికి ఈ కసాయి తల్లికి పూనకం దిగింది.. దాంతో మంటల్లో కాలుతున్న బిడ్డను రక్షించే ప్రయత్నం చేసింది.

స్థానికులతో కలిసి కీల్పాకం ఆస్పత్రికి తరలించింది. అక్కడ చికిత్స పొందుతూ పవిత్ర మృతి చెందింది. సోమవారం పోలీసుల దర్యాప్తులో మూడు పెళ్లిళ్ల భాగోతం.. కసాయి తల్లి నిర్వాకం వెలుగుచూసింది. దీంతో ఆమెను, మూడో భర్తను పోలీసులు అరెస్టు చేశారు. కాగా పు వీరికి పుట్టిన ఇద్దరు పిల్లలు ప్రస్తుతం అనాధలుగా రోడ్డున పడ్డారు.