ఆ ఉద్యోగులకు గుడ్ న్యూస్ ... ఈ ఏడాది భారీగా జీతాల పెంపు వుంటుందట

భారతదేశంలో వివిధ రంగాల్లో పనిచేసే ఉద్యోగుల జీతాలు ఈ ఏడాది బారీగా పెరగనున్నాయని ఓ కన్సల్టెన్సీ సంస్థ చేపట్టిన సర్వే రిపోర్ట్ చెబుతోంది. 

10 Percent Average Salary Hike This Year in Indian Companies : Mercer Survey AKP

వేతన జీవులకు ఓ కన్సల్టెన్సీ సంస్థ తీపి కబురు చెప్పింది. ఈ ఏడాది ఉద్యోగుల సాలరీలు భారీగా పెరగనున్నట్లు సదరు కన్సల్టెన్సీ సర్వే వెల్లడించింది. తమ సంస్థ చేపట్టిన సర్వేలో ఈ విషయం బయటపడినట్లు వెల్లడించారు.

భారతదేశ కంపనీలు తమ ఉద్యోగులకు ఈ ఏడాది (2024) వేతనాలను పెంచెందుకు సిద్దంగా వున్నాయని... సగటును 10 శాతం పెంపు వుండనుందని మెర్సెర్ అనే కన్సల్టెన్సీ సంస్థ ప్రకటించింది. గతేడాది అంటే 2023 లో ఉద్యోగుల సగటు సాలరీ పెంపు 9.5 శాతంగా వుందని సదరు సంస్థ తెలిపింది. 

వివిధ రంగాల్లో పనిచేసే ఉద్యోగుల సాలరీస్ పెంపుపై చేపట్టిన సర్వే వివరాలను మెర్సెర్ కన్సల్టెన్సీ వెల్లడించింది. ముుఖ్యంగా ఆటో మొబైల్, ఉత్పాదక మరియు ఇంజనీరింగ్ సెక్టార్ లో పనిచేసే ఉద్యోగులకు భారీగా జీతాల పెంపు వుంటుందని తమ సర్వేలో వెల్లడయినట్లు మెర్సెర్ తెలిపింది. అలాగే మిగతా రంగాల్లో కూడా   ఉద్యోగుల జీతాలు ఈ ఏడాది 10శాతం మేర పెరగనున్నట్లు ఆ సంస్థ వెల్లడించింది 

Also Read  కోటి రూపాయల జీతం తీసుకునే ఈమె పని ఏంటో తెలుసా.. ?

మెర్సెర్ సంస్థ 2023 మే, ఆగస్ట్ నెలల్లో ఈ సర్వే చేపట్టింది. మొత్తం 1,474 కంపనీల నుండి దాదాపు 6000 రకాల ఉద్యోగాల గురించిన వివరాలను ఈ సంస్థ సేకరించింది. ఇలా దాదాపు 21 లక్షల మంది ఉద్యోగుల పనితీరు, అందుకుంటున్న జీతాలపై ఈ సర్వే సాగింది. మొత్తంగా ఈ ఏడాది జీతాల పెంపు అధికంగా వుండనుందని ఈ సర్వే తేల్చింది. 

ఈ సర్వే ఫలితాలు భారత ఆర్థికవ్యవస్థ పెరుగుదలను కూడా తెలియజేస్తున్నాయని మెర్సెర్ సంస్థ తెలిపింది. ఉద్యోగులు టాలెంట్, సృజనాత్మకతను బట్టి మంచి జీతాలు అందుకుంటున్నారని తెలిపారు. ఆటోమెబైల్, మాన్యుఫాక్చరింగ్ తో పాటు లైఫ్ సైన్సెస్ రంగాల్లో పనిచేసే ఉద్యోగులు అధిక జీతాలు అందుకుంటున్నాని తెలిపారు.  ఈ విభాగాల్లో పోటీతత్వ నెలకొందని... అందవల్లే ప్రతిభ కలిగిన ఉద్యోగులకు కంపనీలు మంచి సాలరీస్ అందిస్తున్నాయని మెర్సర్ సర్వే పేర్కొంది.  

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios