10 మంది మంత్రులు, 20 మందికి పైగా ఎమ్మెల్యేలకు కరోనా పాజిటివ్.. మహారాష్ట్రలో కరోనా కలకలం..
మహారాష్ట్రలో (Maharashtra) మరోసారి కరోనా వైరస్ (Coronavirus) విజృంభిస్తుంది. రోజువారి కేసుల సంఖ్య భారీగా పెరుగుతుంది. తాజాగా మహారాష్ట్రలో 10 మంది మంత్రులు, 20 మందికి పైగా ఎమ్మెల్యేలు కరోనా పాజిటివ్‌గా నిర్దారణ అయింది.
మహారాష్ట్రలో (Maharashtra) మరోసారి కరోనా వైరస్ (Coronavirus) విజృంభిస్తుంది. రోజువారి కేసుల సంఖ్య భారీగా పెరుగుతుంది. ఈ క్రమంలోనే కరోనా కట్టడికి సంబంధించి మహా సర్కార్క కఠిన ఆంక్షలను అమల్లోకి తీసుకొస్తుంది. అయితే ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాలు (Assembly Session) పెద్ద ఎత్తున కరోనా వ్యాప్తి చెందడానికి కారణమైనట్టుగా తెలుస్తోంది. ఇప్పటివరకు 10 మంది మంత్రులు, 20 మందికి పైగా ఎమ్మెల్యేలు కరోనా పాజిటివ్‌గా నిర్దారణ అయింది. ఈ విషయాన్ని మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ వెల్లడించారు. కోవిడ్ కేసులు పెరుగుదల ఇలానే కొనసాగితే.. కఠినమైన ఆంక్షలు అమలు చేయబడతాయని తెలిపారు.
భీమా కోరేగావ్ పోరాటం జరిగి 204 ఏళ్లు పూర్తయిన సందర్భంగా పెర్నా గ్రామంలో జయస్తంభ సైనిక స్మారకాన్ని అజిత్ పవార్ శనివారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ‘మేము ఇటీవల అసెంబ్లీ సెషన్‌ను తగ్గించాం. ఇప్పటివరకు 10 మందికి మంత్రులకు, 20 మందికి పైగా ఎమ్మెల్యేలకు కరోనావైరస్ పాజిటివ్‌గా నిర్దారణ అయింది. ప్రతి ఒక్కరు కొత్త సంవత్సరం వేడుకులు, పుట్టినరోజు సెలబ్రేషన్స్, ఇతర వేడుకలు జరుపుకోవాలని అనుకుంటున్నారు. అయితే కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వేగంగా వ్యాప్తి చెందుతున్న తరుణంలో.. జాగ్రత్త అనేది అవసరం. ప్రధాని నరేంద్ర మోదీ ప్రజలను అభ్యర్థించారు. కొన్ని రాష్ట్రాలు నైట్ కర్ఫ్యూను కూడా ప్రకటించాయి. ముంబై, పూణేలో కేసులు పెరుగుతున్నాయి’ అని అజిత్ పవార్ శనివారం విలేకరులతో అన్నారు.
Also Read: Omicron in India: భారత్‌లో 1,431కి చేరిన ఒమిక్రాన్ కేసులు.. లక్ష దాటిన కరోనా యాక్టివ్ కేసులు
పెరుగుతున్న కరోనా కేసుల నేపథ్యంలో ప్రభుత్వం నిఘా పెంచిందని.. రోగుల సంఖ్య పెరిగితే కఠినమైన ఆంక్షలు విధించనున్నట్టుగా చెప్పారు. ఇలాంటి పరిస్థితి రాకుండా ఉండేందుకు ప్రతి ఒక్కరూ నిబంధనలు తప్పకుండా పాటించాలని కోరారు.
ఇక, ముంబైలో శుక్రవారం కొత్తగా 5,631 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇది గురువారం నమోదైన కేసుల సంఖ్య కంటే 2,000 ఎక్కువ. మరోవైపు పుణెలో శుక్రవారం కొత్తగా 412 కరోనా కేసులు నమోదయ్యాయి. మరోవైపు ఒమిక్రాన్ కేసులు కూడా మహారాష్ట్రలో భారీగా నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర సర్కార్ ఇప్పటికే పలు ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే.