ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని  బడోహీలోని ఓ ఫ్యాక్టరీలో శనివారం నాడుపేలుడు చోటు చేసుకొంది.ఈ ఘటనలో 10 మంది మృతి చెందారు. మరో  ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు.

బహోడీ ప్రాంతంలోని రోహత బజార్‌లో ఓ ఉన్న కార్పెట్ ఫ్యాక్టరీలో అక్రమంగా బాణాసంచా తయారీ చేస్తుండగా ఈ ప్రమాదం వాటిల్లినట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు.

ఈ పేలుడు దాటికి మూడు ఇళ్లు కుప్పకూలిపోయాయి. ఈ భవన శిధిలాల కింద కొందరు ఇరుక్కొని ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. సహాయక చర్యలను చేపట్టారు.  ఈ ఘటనలో ఇప్పటికే 10 మంది మృతి చెందారు. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.