మహారాష్ట్రలోని  నాసిక్-షీర్డీ   హైవేపై  ఇవాళ తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో  10 మంది మృతి చెందారు.  మృతి చెందిన వారిలో  ఏడుగురు మహిళలున్నారు.

ముంబై: మహారాష్ట్రలోని నాసిక్-షీర్డీ హైవేపై శుక్రవారం నాడు ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో 10 మంది మృతి చెందారు.మహరాష్ట్రలోని వావీ పోలీస్ స్టేషన్ పరిధిలోని పతారే గ్రామ పరిధిలోని నాసిక్-షిర్డీ హైవేపై ట్రక్కు, బస్సు ఇవాళ తెల్లవారుజామున ఢీకొన్నాయి.ఈ ప్రమాదంలో 10 మంది మృతి చెందారు. ఇందులో ఏడుగురు మహిళలున్నారు. ఈ ప్రమాదంలో మరో 17 మంది తీవ్రగా గాయపడ్డారు. గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

థానే జిల్లాలోని అంబరీనాథ్ నుండి లగ్జరీ బస్సులో 45 మంది షీర్డీకి బయలుదేరారు. వావీ పోలీస్ స్టేషన్ పరిధిలో ట్రక్కు, ప్రైవేట్ బస్సులు ఢీకొన్నాయి. దీంతో 10 మంది మృతి చెందినట్టుగా పోలీసులు చెప్పారు. అతివేగమే ఈ ప్రమాదానికి కారణంగా చెబుతున్నారు. ఈ ప్రమాదం విషయం తెలిసిన వెంటనే సీనియర్ పోలీస్ అధికారులు సంఘటన స్థలానికి చేరకుని సహాయక చర్యలు చేపట్టారు. 

షిన్నార్ షిర్డీ హైవేపై ప్రతి ఏటా పలు రోడ్డ ప్రమాదాలు జరుగుతాయి. ఈ ప్రమాదాల్లో పలువురు మృత్యువాత పడుతున్నారు. మరికొందరు గాయాలకు గురౌతున్నారు. ఈ రోడ్డును విస్తరణ దాదాపుగా పూర్తైంది. అయినా కూడ రోడ్డు ప్రమాదాలు మాత్రం ఆగడం లేదు.