తమిళనాడులో ఘోర ప్రమాదం జరిగింది. ఆలయంలో తొక్కిసలాట జరిగి ఏడుగురు భక్తులు దుర్మరణం పాలయ్యారు. తిరుచ్చిలోని ముత్యంపాలయంలో ఉన్న కురుప్ప స్వామి ఆలయంలో చైత్రమాస ఉత్సవాలు ప్రతి ఏటా జరుగుతాయి.

ఈ సందర్బంగా భక్తులకు హుండీలోని చిల్లర నాణేలను ఇవ్వడం ఆనవాయితీగా వస్తోంది. ఈ క్రమంలో ఆదివారం ఉదయం అర్చకులు నాణేలను పంచుతుండగా.. భక్తులు ఎగబడటంతో తొక్కిసలాట జరిగింది.

మరణించిన వారు కరూర్, కడలూరు, సేలం, నమక్కల్, విల్లుపురం జిల్లాలకు చెందిన వారిగా గుర్తించారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు.