పశ్చిమబెంగాల్ లో విద్యుదాఘాతం 10మందిని బలి తీసుకుంది. పికప్ వ్యాన్ లో ఉణ్న డీజే సిస్టం జనరేటర్ వైర్ తో కరెంట్ సరఫరా అయ్యి... అందులో ప్రయాణిస్తున్న 10మంది మరణించారు. 

పశ్చిమ బెంగాల్ : పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో ఆదివారం రాత్రి ఘోర ప్రమాదం జరిగింది. డీజే సిస్టం ఉన్న పిక్ అప్ వ్యాన్లో విద్యుత్ షాక్ తో ప్రమాదం జరిగింది. ఆదివారం రాత్రి జనరేటర్ విద్యుత్ వైరు..వ్యాన్ కు తగిలి విద్యుదాఘాతం జరిగింది. ఈ విద్యుత్ ప్రమాద ఘటనలో పది మంది అక్కడికక్కడే మరణించారు. వ్యానులో ఉన్న మరో 19 మంది గాయపడటంతో వారిని చికిత్స కోసం జల్పాయిగురి ఆస్పత్రికి తరలించారు. జనరేటర్ ఉన్న పికప్ వ్యాన్లో ప్రయాణికులు కూచ్ బీహార్ నుంచి జల్పేష్ పట్టణానికి వెళుతుండగా ధార్ల బ్రిడ్జి దగ్గర విద్యుదాఘాతం జరిగింది.

డిజె సిస్టం జనరేటర్ కు ఉన్న విద్యుత్ వైరును వ్యాను వెనక భాగంలో కట్టారు. కాగా, అందులో విద్యుత్ ప్రసరించింది. అది వ్యాన్ కు అంటుకోవడంతో అందులో ఉన్నవారికి కరెంట్ షాక్ తగిలిందని అదనపు పోలీసు సూపరింటెండెంట్ అమిత్ వర్మ తెలిపారు. విద్యుదాఘాతానికి గురైన పిక్ అప్ వ్యాన్ లో 27 మంది ప్రయాణికులు ఉండగా.. వారిలో 10 మంది మరణించారని వైద్యులు ప్రకటించారు, మరో 19 మంది తీవ్రంగా గాయపడటంతో వారిని మెరుగైన చికిత్స కోసం జుల్పాయిగురి ఆసుపత్రికి తరలించామని వైద్యులు చెప్పారు. ఈ దుర్ఘటనలో మృతులంతా సీతల్ కూచి ప్రాంత వాసులు అని పోలీసులు తెలిపారు. వ్యాన్ ను సీజ్ చేశామని, డ్రైవర్ పరారీలో ఉన్నాడని పోలీసులు అన్నారు. విద్యుదాఘాతం ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని పశ్చిమబెంగాల్ పోలీసులు తెలిపారు.

LPG Cylinder Price : ఎల్పీజీ వినియోగదారుల‌కు గుడ్ న్యూస్.. త‌గ్గిన సిలిండ‌ర్ ధ‌ర‌..