ఛంఢీగఢ్: హర్యానా రాష్ట్రంలోని జీండ్ ప్రాంతంలో బుధవారం నాడు ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో 10 మంది మృతి చెందారు. 

జీండ్ లో ట్యాంకర్, ఆటో ను బుధవారం నాడు  ఉదయం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 10 మంది అక్కడికక్కడే మృతి చెందారు. మృతి చెందిన వారిలో 9 మంది విద్యార్ధులు ఉన్నారు.

ఈ ఘటనకు సంబంధించి ఇంకా పూర్తి వివరాలు అందాల్సి ఉంది.