ధర్మశాల: బస్సు అదుపు తప్పి లోయలో పడడడంతో పది మంది దుర్మరణం పాలయ్యారు. పలువురు గాయపడ్డారు. ఈ ప్రమాదం హిమాచల్ ప్రదేశ్ లోని చాంబా జిల్లా నైనిఖడ్ లో శనివారం సాయంత్రం జరిగింది. 

పఠాన్ కోట్ నుంచి డౌల్హౌసీ వెళ్తున్న ప్రైవేట్ బస్సు అదుపు తప్పి లోయలో పడింది. పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. మృతుల సంఖ్య పెరిగే ప్రమాదం ఉందని అంటున్నారు 

ప్రయాణికులను వెలికి తీయడానికి సహాయక బృందాలు కట్టర్స్ ను వాడాయి. బస్సులో ఎంత మంది ప్రయాణిస్తున్నారనేది తెలియలేదని పోలీససులు చెప్పారు.