మహారాష్ట్రలో ఘోర ప్రమాదం: 10 మంది మృతి, 12 మందికి గాయాలు

First Published 7, Jun 2018, 1:29 PM IST
10 dead, 12 injured as mini-bus hits stationary truck in   Maharashtra
Highlights

మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం

ముంబై: మహరాష్ట్రలోని ముంబై- ఆగ్రా జాతీయ రహాదారిపై గురువారం నాడు ఉదయం
జరిగిన రోడ్డు ప్రమాదంలో 10 మంది మృతి చెందగా, మరో 12 మంది తీవ్రంగా
గాయపడ్డారు.

 
మహారాష్ట్రలోని నాసిక్ సమీపంలోని చాంద్వాడ్‌ సోగ్రస్ ఫాటాలో ప్రయాణీకులతో వెళ్తున్న
మినీ బస్సు ఇసుక ట్రక్కును ఢీకొంది. ఇసుక లోడ్‌తో వెళ్తున్న లారీ టైర్ పంక్చరైంది.
దీంతో లారీని రోడ్డు పక్కనే నిలివివేశాడు డ్రైవర్.  అయితే నిలిచి ఉన్న లారీని మినీ బస్సు
ఢీకొట్టింది.

ఈ ప్రమాదంలో  10 మంది అక్కడికక్కడే మరణించారు. మరో 12 మంది తీవ్రంగా
గాయపడ్డారు. మినీ బస్సులో ప్రయాణిస్తున్న వారంతా మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఉజ్జయిని  
నుండి మహారాష్ట్రలోని కళ్యాణ్‌కు తిరిగొస్తున్నారు.గాయపడిన వారిని ఆసుపత్రిలో
చేర్పించారు.ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.


 

loader