తమ పార్టీకి చెందిన 10 మంది ఎమ్మెల్యేలకు డబ్బులు, పదవులను ఆశ చూపుతూ ఫోన్లు చేస్తున్నారని మధ్యప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి కమల్‌నాథ్ సంచలన ఆరోపణలు చేశారు. 

భోపాల్: తమ పార్టీకి చెందిన 10 మంది ఎమ్మెల్యేలకు డబ్బులు, పదవులను ఆశ చూపుతూ ఫోన్లు చేస్తున్నారని మధ్యప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి కమల్‌నాథ్ సంచలన ఆరోపణలు చేశారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred

మంగళవారం నాడు కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసిన ఎంపీ అభ్యర్థులతో సమావేశమైన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. డబ్బులు, పదవులు ఇస్తామని తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలను ప్రలోభపెడుతున్నారని ఆయన మీడియాకు చెప్పారు. తమ పార్టీ ఎమ్మెల్యేలు ఎవరూ కూడ పార్టీ మారరని ఆయన విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. 

అసెంబ్లీలో బలనిరూపణ చేసుకోవాలని బీజేపీ చేసిన డిమాండ్‌ను ఆయన స్వాగతించారు. అసెంబ్లీలో బలనిరూపణకు తాను సిద్దంగా ఉన్నానని ఆయన చెప్పారు. తాను నాలుగు సార్లు బల నిరూపణ చేసుకొన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. మరోసారి బలనిరూపణ చేసుకొనేందుకు కూడ తాను సిద్దమేనని ఆయన ప్రకటించారు.