Asianet News TeluguAsianet News Telugu

ఛత్తీస్‌ఘడ్‌లో మావోలు, పోలీసుల మధ్య కాల్పులు: మావోయిస్టు మృతి, పోలీసుల గాలింపు


 చత్తీస్‌ఘడ్ లో మావోలు, పోలీసులకు మధ్య ఆదివారం నాడు ఎదురుకాల్పులు చోటు చేసుకొన్నాయి.ఈ ఘటనలో ఓ మావోయిస్టు మృతి చెందాడు. పోలీసులు కూంబింగ్ నిర్వహిస్తున్నారు.

1 maoist killed in encounter in Chhattisgarh lns
Author
New Delhi, First Published Jul 25, 2021, 1:29 PM IST

రాయ్‌పూర్:  ఛ‌త్తీస్‌గఢ్ లో  ఆదివారం నాడు  పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు చోటు చేసుకొన్నాయి. ఈ కాల్పుల్లో ఓ మావోయిస్టు హతమైనట్లు పోలీసులు వెల్లడించారు. ఛ‌త్తీస్‌గఢ్ రాష్ట్రం సుక్మా జిల్లా చింతగుఫా ప్రాంతంలో సీఆర్పీఎఫ్ కు చెందిన రెండు బెటాలియన్లు, డీఆర్జీ, ఎస్టీఎఫ్ భద్రతా దళాలు సంయుక్తంగా కూంబింగ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నాయి.

ఈ క్రమంలో మావోయిస్టులు తారసపడి కాల్పులు ప్రారంభించినట్లు భద్రతా అధికారులు తెలిపారు. వెంటనే అప్రమత్తమైన జవాన్లు ఎదురు కాల్పులు జరిపారని ఈ ఘటనలో ఓ గుర్తు తెలియని మావోయిస్టు మృతి చెందినట్లు సుక్మా ఎస్పీ సునీల్ శర్మ పేర్కొన్నారు.మావోయిస్టు మృతదేహంతో పాటు ఒక బర్మార్ తుపాకీ స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. ఇంకా కూంబింగ్ ఆపరేషన్ కొనసాగుతోందని ఆయన వెల్లడించారు. కాగా మావోయిస్టుల వారోత్సవాల దృష్ట్యా పోలీస్ బలగాలు అడవుల్లో గాలింపు చర్యలను ముమ్మరం చేశాయి. ఈ నేపథ్యంలో కొన్ని రోజుల నుంచి కూంబింగ్ ఆపరేషన్ ను విస్తృతంగా నిర్వహిస్తున్నారు.


 

Follow Us:
Download App:
  • android
  • ios