భారతదేశంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 1580 కోవిడ్ కేసులో నమోదయ్యాయి. 12మంది వైరస్ బారిన పడి మరణించారు.
న్యూఢిల్లీ : భారతదేశంలో గడిచిన 24 గంటల్లో 1,580 తాజా కోవిడ్ ఇన్‌ఫెక్షన్లు నమోదయ్యాయి. అయితే, యాక్టివ్ కేసులు 19,613 నుండి 18,009కి తగ్గాయని శుక్రవారం కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ డేటా తెలిపింది. వీటితో కలిపి దేశంలో ఇప్పుడు మొత్తం కోవిడ్-19 కేసుల సంఖ్య 4.49 కోట్లు (4,49,76,599)కు చేరింది.
12 తాజా మరణాలతో మరణాల సంఖ్య 5,31,753కి చేరుకుంది. ఇందులో కేరళ మృతుల సంఖ్య కూడా ఉంది. ఉదయం 8 గంటలకు ఈ డేటాను నవీకరించారు. మొత్తం ఇన్ఫెక్షన్‌లలో యాక్టివ్ కేసులు 0.04 శాతం ఉన్నాయి.
జాతీయ COVID-19 రికవరీ రేటు 98.77 శాతంగా నమోదైందని మంత్రిత్వ శాఖ తెలిపింది. వ్యాధి నుండి కోలుకున్న వారి సంఖ్య 4,44,28,417 కు పెరిగింది, అయితే కేసు మరణాల రేటు 1.18 శాతంగా ఉంది.
మంత్రిత్వ శాఖ వెబ్‌సైట్ ప్రకారం, దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ డ్రైవ్ కింద ఇప్పటివరకు 220.66 కోట్ల డోస్‌ల COVID-19 వ్యాక్సిన్‌లు ఇవ్వబడ్డాయి.
