నిర్భయ దోషుల ఉరి తేదీ మారింది. మొన్నటి వరకు ఈ నెల 22వ తేదీన నలుగురు దోషులను ఒకేసారి ఉరి తీస్తారని అందరూ భావించారు.  సడెన్ గా.. నిర్భయ దోషులను ఈ నెల 22వ తేదీన ఉరితీయలేమని.. తేదీ మార్చాలిందిగా తీహార్ జైలు అధికారులు ఢిల్లీ ప్రభుత్వానికి లేఖ రాశారు. దీనిపై నిర్భయ తల్లి ఆశాదేవి స్పందించారు. తీహార్ జైలు అధికారులకుపై ఆమె మండిపడ్డారు.

దోషుల డెత్ వారెంట్ ని మార్చకూడదని ఆమె పేర్కొన్నారు. దోషులను మరణ శిక్ష నుంచి తప్పించేందకు కుట్రలు జరుగుతున్నాయని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తన ఒక్కగానొక్క కూతురిని దారుణంగా హత్య చేశారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తన కూతురికి న్యాయం చేయాలని ఎన్నో సంవత్సరాలుగా తాను కోర్టుల చుట్టూ తిరుగుతున్నట్లు చెప్పారు. తీహార్ జైలు అధికారులు, ఢిల్లీ ప్రభుత్వం నిర్లక్ష్యానికి తానెందుకు బాధపడాలని ఆమె ప్రశ్నించారు.

Also Read నిర్భయ కేసు దోషులకు ఉరిశిక్ష వివాదం: సిసోడియా సంచలన వ్యాఖ్యలు...

వాళ్లకు హక్కులు ఉంటే.. ఏడేళ్ల క్రితం దారుణ హత్యకు గురైన తన కూతురికి న్యాయం  చేయమని కోరే హక్కు మాకు లేదా అని ఆమె ప్రశ్నించారు. నిర్భయ దోషి ముకేష్ వేసిన క్షమాభిక్ష పిటిషన్ పెండింగ్ లో ఉన్నందువల్ల జైలు నిబంధనల ప్రకారం ఉరిశిక్ష అమలు చేయలేమంటూ తీహార్ జైలు అధికారులు కోర్టుకి తెలియజేశారు.

ఈ నేపథ్యంలోనే ఉరిశిక్ష విధించే తేదీలను మార్చాల్సిందిగా న్యాయస్థానాన్ని కోరారు. దీనిపై  కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ తీవ్ర ఆరోపణలు చేశారు. ఆప్ ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగానే నిర్భయ దోషులకు ఉరి ఆలస్యం అవుతోందని ఆయన పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలపై ప్రస్తుతం దుమారం రేగుతోంది.