బాలీవుడ్ అలనాటి అందాల తార, ఎంపీ హేమమాలిని డ్యాన్స్ కి కేంద్ర మంత్రి సుష్మాస్వరాజ్ ఫిదా అయ్యారు. ఆమె నృత్య ప్రదర్శనను చూసి పులకించిపోయిన సుష్మా స్వరాజ్.. ప్రశంసల వర్షం కురిపించారు.

పూర్తి వివరాల్లోకి వెళితే...వారణాసిలో ప్రవాసి భారతీయ దివస్ సమ్మేళనం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హేమమాలిని దాదాపు 90 నిమిషాల పాటు నృత్య ప్రదర్శన చేశారు.  గంగా మాత రూపంలో ఆమె చేసిన డ్యాన్స్ ని చూసి అందరూ ఫిదా అయ్యారు. కాగా.. ఆమె డ్యాన్స్  కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్ కి విపరీతంగా నచ్చేసింది. ఈ విషయాన్ని ఆవిడే స్వయంగా వెల్లడించారు.

‘‘హేమమాలిని నృత్య ప్రదర్శన చూశాక మాట్లాడేందుకు నాకు మాటలు రావడం లేదు...జీవితం నేను ఇలాంటి అద్భుత ప్రదర్శనను మొదటిసారి చూశాను...హేమమాలిని నృత్యంపై మూడు మాటలు చెబుతాను అంటూ నమ్మశక్యం కానిది, ఊహించలేనంతటి అద్భుత ప్రదర్శన ’’ అంటూ సుష్మాస్వరాజ్ ఆమెను అభినందించారు. 

అసిత్ దేశాయ్ అతని కుమారుడు అలాప్ దేశాయ్ లు నృత్యాన్ని కంపోజ్ చేయగా పాటలను సుదేష్ వాడ్కర్, కవితా కృష్ణమూర్తి, శంకర్ మహదేవన్, మీకాసింగ్ లు ఆలపించారు. హేమమాలిని ధరించిన దుస్తులను నీతా లుల్లా డిజైన్ చేశారు. విభోరీ ఖండేల్ వాల్ స్పెషల్ ఎఫెక్ట్స్ తో సాగిన హేమమాలిని నృత్య ప్రదర్శన అందరినీ విశేషంగా అలరించింది.