న్యూఢిల్లీ: ట్రిపుల్ తలాక్ బిల్లుకు గురువారం నాడు లోక్‌సభ ఆమోదం తెలిపింది.ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ ప్రతిపాదనలు వీగిపోయాయి. ఈ బిల్లును జేపీసీకి పంపకపోవడంతో కాంగ్రెస్, అన్నాడీఎంకెలు సభ నుండి  వాకౌట్ చేశాయి. 

ఈ బిల్లుపై నిర్వహించిన ఓటింగ్‌లో అనుకూలంగా 245మంది, వ్యతిరేకంగా 11 మంది ఓటు చేశారు.

రెండు దఫాలు లోక్‌సభ వాయిదా పడిన తర్వాత మధ్యాహ్నం రెండు గంటలకు  సభ ప్రారంభమైంది. సభ ప్రారంభం కాగానే న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ ట్రిపుల్ తలాక్ బిల్లును ప్రవేశపెట్టారు.

ఈ బిల్లును  జాయింట్ సెలెక్ట్ కమిటీకి పంపాలని  కాంగ్రెస్, టీఎంసీ, ఆర్ఎస్పీ, ఎంఐఎం డిమాండ్ చేశాయి.ఈ డిమాండ్‌తో ఓటింగ్ కు ముందే ఈ పార్టీలు సభ నుండి వాకౌట్ చేశాయి.

ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ ట్రిపుల్ తలాక్ బిల్లును తీవ్రంగా వ్యతిరేకించారు. శబరిమల హిందూవుల విశ్వాసమైతే, ట్రిపుల్ తలాక్ కూడ ముస్లింల విశ్వాసంగా ఆయన పేర్కొన్నారు.

ట్రిపుల్ తలాక్ ఇచ్చిన వ్యక్తికి మూడేళ్ల పాటు జైలు శిక్ష విధించడం ఎలా సరైందని ఆయన ప్రశ్నించారు. ఈ బిల్లుకు ఓవైసీ పలు సవరణను ప్రతిపాదించారు.ఈ సవరణలు వీగిపోయాయి.

ఈ బిల్లును వచ్చే 15 రోజుల్లో జాయింట్ సెలెక్ట్ కమిటీకి పంపాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్, అన్నాడీఎంకెలు లోక్‌సభ నుండి వాకౌట్ చేశాయి. ట్రిపుల్ తలాక్ బిల్లుపై లోక్‌సభలో ఓటింగ్ నిర్వహించారు.

సంబంధిత వార్తలు

ట్రిపుల్ తలాక్ బిల్లు: పార్లమెంట్‌లో గందరగోళం, జేపీసీకి విపక్షాల పట్టు