ప్రముఖ యోగా గురు రాందేవ్ బాబా మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇద్దరి కంటే ఎక్కువ మంది పిల్లల్ని కనేవారికి ఓటు హక్కు తొలగించాలని అభిప్రాయపడ్డారు. ఉత్తరప్రదేశ్ లోని అలీగఢ్ లో జరిగిన ఓ కార్యక్రమానికి హాజరైన ఆయన  జనాభా నియంత్రణపై మాట్లాడారు.

దేశంలో జనాభాను నియంత్రించాలంటే.. ఇద్దరి కంటే ఎక్కువ మంది పిల్లల్ని కన్న తల్లిదండ్రులకు ఓటు హక్కును తొలగించాలన్నారు. అలాంటి వారికి ప్రభుత్వ ఉద్యోగాలు,వైద్య సదుపాయాలు కూడా కల్పించకూడదన్నారు. అది హిందువులైనా.. ముస్లింలైనా ఎవరికైనా ఇదే నియమాన్ని వర్తించాలన్నారు. అప్పుడే జనాభాను నియంత్రించగలమని చెప్పారు.

గతంలోనూ రాందేవ్ బాబా జనాభా నియంత్రణ విషయంలో ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కాగా.. రాందేవ్ బాబా చేసిన వ్యాఖ్యలపై పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.