Asianet News TeluguAsianet News Telugu

కేజ్రీవాల్ ప్రమాణస్వీకారం... ముఖ్య అతిథి.. బుల్లి మఫ్లర్ మ్యాన్

ఎన్నికల ఫలితాలు విడుదల రోజు... తలకు టోపీ, మెడకు మఫ్లర్ పెట్టుకొని ఓ చిన్నారి ఫోటో వైరల్ అయ్యింది మీకు గుర్తుండే ఉంటుంది. ఇప్పుడు ఆ బుడతడినే.. ముఖ్య అతిథిగా ఆహ్వానిస్తున్నారు.

"Suit Up, Junior": AAP Invites "Baby Mufflerman" To Arvind Kejriwal Oath
Author
Hyderabad, First Published Feb 14, 2020, 8:25 AM IST

హోరాహోరీగా జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభంజనం సృష్టించింది. ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్  మూడోసారి ఢిల్లీ పీఠం ఎక్కనున్నారు. ఈ నెల 16వ తేదీన ఆయన ఢిల్లీ  ముఖ్యమంత్రిగా ముచ్చటగా మూడోసారి ప్రమాణస్వీకారం చేయనున్నారు. కాగా... ఈ ప్రమాణస్వీకారానికి ఓ ముఖ్య అతిథిని ఆహ్వానిస్తున్నారు.

ఆయన ఎవరోకాదు... ఎన్నికల ఫలితాలు విడుదల రోజు... తలకు టోపీ, మెడకు మఫ్లర్ పెట్టుకొని ఓ చిన్నారి ఫోటో వైరల్ అయ్యింది మీకు గుర్తుండే ఉంటుంది. ఇప్పుడు ఆ బుడతడినే.. ముఖ్య అతిథిగా ఆహ్వానిస్తున్నారు.

Also Read బుల్లి మఫ్లర్ వాలా: కేజ్రీవాల్‌ను మరిపిస్తున్న చిన్నోడు, నెటిజన్లు ఫిదా...

పూర్తి వివరాల్లోకి వెళితే... కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీని ఢీకొట్టి మరి కేజ్రీవాల్ విజయం సాధించడంతో ఆయన క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. సమయానికి తగ్గట్టుగా పొదుపుగా మాట్లాడే అరవింద్ కేజ్రీవాల్‌ అనగానే ముందుగా గుర్తొచ్చేది ఆయన మఫ్లరే.

దేశ రాజధానిలో చలిని తట్టుకునేందుకు గాను కేజ్రీవాల్ పైన టోపీ పెట్టి, తల చుట్టూ మఫ్లర్ ధరిస్తారు. దీనిపై ఆయన రాజకీయ ప్రత్యర్థులు జోకులు, కామెంట్లు వేస్తూ ఉంటారు కూడా. అంతలా పాపులరైన కేజ్రీవాల్ మఫ్లర్ వేషం వేసుకుని ఓ చిన్నారి అందరినీ ఆకట్టుకున్నాడు.

ఢిల్లీ ఎన్నికల్లో ఓట్ల లెక్కింపు ప్రారంభమవ్వడానికి కొద్దిసేపటి క్రితం ఆప్ ఈ బుడ్డోడి ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ‘‘మఫ్లర్ మ్యాన్’’ అంటూ దీనికి క్యాప్షన్ ఇచ్చింది. దీనిపై నెటిజన్లు పెద్ద ఎత్తున స్పందించారు.

ఆ బుల్లి మఫ్లర్ మ్యాన్ ఫోటో ఫుల్ ట్రెండ్ అయ్యింది. లక్షల్లో లైకులు, వేలల్లో కామెంట్స్ వచ్చి పడ్డాయి. దీంతో... ఆ బుడ్డోడు వైరల్ అయ్యాడు. అయితే... ఇప్పుడు ఆ బుజ్జి మఫ్లర్ మ్యాన్ ని ముఖ్య అతిథిగా ప్రమాణస్వీకార కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నట్లు ఆప్ ప్రకటించింది. ఇదిలా ఉండగా... ఈ ఎన్నికల్లో మొత్తం 70 నియోజకవర్గాల్లో 62 స్థానాలను ఆప్ గెలుచుకోగా...బీజేపీ 8 స్థానాలకు పరిమితమైంది. ఇక కాంగ్రెస్ కనీసం ఒక్క సీటు కూడా గెలుచుకోకపోవడం గమనార్హం. 

Follow Us:
Download App:
  • android
  • ios