పలు భాషల్లో కర్నాడ్ సినిమాల్లో నటించాడని ఆయన గుర్తు చేశాడు.  అంతేకాదు ఆయన రచనలు కూడ ప్రాముఖ్యం పొందాయన్నారు.భవిష్యత్ తరాలు కూడ కర్నాడ్  చేసిన పనులను గుర్తుంచుకొంటారని మోడీ అభిప్రాయపడ్డారు.

మరో వైపు రాష్ట్రపతి కోవింద్ కూడ  గిరిష్ కర్నాట్ మృతిపై సంతాపం తెలిపారు. మృతుడి కుటుంబసభ్యులకు కోవింద్ సానుభూతి తెలిపారు.ఇదిలా ఉంటే ప్రముఖ కన్నడ నాటక రచయిత, నటుడు దర్శకుడు, జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత, పద్మశ్రీ పద్మ భూషణ్ గిరీష్ కర్నాడ్ మృతికి  తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. 

దేశ నాటక సాహిత్య రంగంలో ఎనలేని కృషి చేసేన ఆయన సేవలు అంతర్జాతీయంగా పేరు ప్రఖ్యాతులుగాంచాయని సిఎం కొనియాడారు. వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు.గిరీష్ మృతిపై ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కాంగ్రెస్ పార్టీ నేత సుర్జేవాలా సంతాపాన్ని తెలిపారు.