ప్రతి రోజూ సంస్కృతం మాట్లాడితే... డయాబెటిస్, కొలిస్ట్రాల్ మన దరికి కూడా చేరవట. ఈ విషయాన్ని బీజేపీ నేత ఎంపీ గణేష్ సింగ్ పేర్కొన్నారు. దీనిపై అమెరికాకు చెందిన ఓ సంస్థ సర్వే జరిపిందని... ఆ సర్వేలో ఈ విషయం వెల్లడయ్యిందని... గణేష్ సింగ్ పేర్కోవడం గమనార్హం.

గురువారం సంస్కృతం విశ్వవిద్యాలయాల బిల్స్ కి సంబంధించి పార్లమెంట్ లో చర్చకు రాగా.. ఈ బీజేపీ నేత స్పందించారు. . ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... సంస్కృతం మాట్లాడటం వల్ల అనారోగ్య సమస్యలు దూరమౌతాయని చెప్పారు. అక్కడితో ఆగలేదు. నాసా వాళ్లు కంప్యూటర్ ప్రోగ్రామ్ ని సంస్కృతంలో చేస్తే... అసలు ఏలాంటి సమస్య రాదని చెప్పడం విశేషం.

మన ప్రపంచంలోని అన్ని భాషాలు దాదాపు 97శాతం సంస్కృతం నుంచి పుట్టుకు వచ్చాయని ఆయన అన్నారు. ఇస్లాం కూడా సంస్కృతం నుంచే పుట్టిందని చెప్పారు. ఇంగ్లీష్ భాషలోని చాలా పదాలు.. సంస్కృతం నుంచి విడగొట్టి వాడుతున్నారని ఆయన చెప్పారు. 

ఇక కేంద్రమంత్రి ప్రతాప్ చంద్ర సారంగి మాట్లాడుతూ.. సంస్కృత చాలా సరళమైన భాష అన్నారు. ఒక్కో పదాన్ని ఎన్నో విధాలుగా వాడుకోవచ్చన్నారు. ఇంగ్లీష్‌ పదాలైన బ్రదర్,కౌ వంటి పదాలు సంస్కృతమే నుంచే వచ్చాయన్నారు. సంస్కృతాన్ని ప్రమోట్ చేయడం కాగా... ఈ బీజేపీ నేత  చేసిన కామెంట్స్ ఇప్పుడు తీవ్ర వివాదాస్పదమయ్యాయి.