న్యూఢిల్లీ: కరోనా వైరస్ ను అధిగమించేందుకు 15 నిమిషాల పాటు ఎండలో కూర్చోవాలని కేంద్ర ఆరోగ్య శాఖ సహాయ మంత్రి ఆశ్విని చౌబే ప్రజలకు సలహా ఇచ్చారు. కరోనా వైరస్ ను చంపేందుకు సూర్యరశ్మితో వైరస్ ను చంపే వ్యాధి నిరోధక శక్తి మెరుగయ్యే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.

గో మూత్రంతో క్యాన్సర్ కు చికిత్స అందించవచ్చని గతంలో ఇదే మంత్రి వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ప్రతి రోజూ ఉదయం 11 గంటల నుండి 2 గంటల వరకు ఎండలో కూర్చొంటే  శరీరానికి అవసరమైన డి విటమిన్ లభిస్తోందని ఆయన చెప్పారు. దీంతో వ్యాధి నిరోధక శక్తి పెరిగి కరోనా లాంటి వైరస్ లను ఎదుర్కొనే అవకాశం ఉందన్నారు.

కేంద్ర ప్రభుత్వం కరోనా వ్యాధి వైరస్ వ్యాప్తి చెందకుండా రాష్ట్రాలకు పలు సూచనలు చేస్తోంది. పలు రాష్ట్రాలతో ప్రధాని మోడీ ఈ నెల 20వ తేదీ వీడియో కాన్పరెన్స్ నిర్వహించనున్నారు.కరోనా వ్యాధి వ్యాప్తి చెందకుండా తీసుకోవాల్సిన చర్యలపై ఆయన ఆయా రాష్ట్రాలకు ప్రత్యేక ఆదేశాలు జారీ చేయనున్నారు.