సూపర్ స్టార్ రజినీకాంత్ కి...  విలక్షణ నటుడు, మక్కళ్ నీది మయ్యమ్ అధినేత కమల్ హాసన్ మద్దతుగా నిలిచాడు. తమిళనాడు ప్రభుత్వంపై విమర్శలు కురిపించిన కమల్... రజినీకాంత్ మాట్లాడినదాంట్లో తప్పేమి ఉందని ప్రశ్నించారు.  తమిళనాడు రాష్ట్రంలో రాజకీయ సంక్షోభం నెలకొందంటూ ఇటీవల రజనీకాంత్ పేర్కొన్న సంగతి తెలిసిందే. కాగా.... ఆయన చేసిన కామెంట్స్ కి కమల్ మద్దతు ఇచ్చారు.

తమిళనాడులో రాజకీయ సంక్షోభం నెలకొందని అన్నారు. రాష్ట్రంలో న్యాయకత్వం లోపించిందని ఆరోపించారు. గతంలో మంచి నాయకులు ఉండేవారని.. వాళ్లు రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించారని చెప్పారు. కానీ ఇప్పుడు అలాంటి నేతలు కరవయ్యారని కమల్ అభిప్రాయపడ్డారు.

గతంలో రజినీకాంత్ కూడా ఇవే మాటలు చెప్పారని గుర్తు చేశారు. కానీ రజినీకాంత్ చెప్పిన సత్యాలు రాష్ట్ర ముఖ్యమంత్రి పళనిస్వామి జీర్ణించుకోలేకపోయారు. సూపర్ స్టార్ మాటల్లో నాకెక్కడా తప్పు కనిపించలేదని కమల్ అన్నారు. గత వారం రజినీ ఓ కార్యక్రమంలో పాల్గొని రాష్ట్రంలో సరైన నాయకుడు లేడని.. అధికార, ప్రతిపక్షాల వల్ల రాష్ట్రంలో నిరసనలు హోరెత్తిస్తున్నారంటూ రజినీకాంత్ పేర్కొన్న సంగతి తెలిసిందే. కాగా... ఆ కామెంట్స్ కి కమల్ సమర్థించారు.