అది తప్పుడు కథనం : ఢిల్లీ ఎయిమ్స్‌లో బయటపడ్డ కేసులు చైనా న్యుమోనియా కాదు , తేల్చిచెప్పిన కేంద్రం
ఢిల్లీలోని ఎయిమ్స్‌లో బాక్టీరియా కేసుల గుర్తింపును చైనాలో ఇటీవల చోటు చేసుకున్న న్యుమోనియా కేసుల పెరుగుదలతో ముడిపెట్టిన మీడియా నివేదికపై కేంద్ర ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. అది పూర్తిగా "తప్పుదోవ పట్టించేది , తప్పుడు సమాచారం" అని కొట్టిపారేసింది.
ఢిల్లీలోని ఎయిమ్స్‌లో బాక్టీరియా కేసుల గుర్తింపును చైనాలో ఇటీవల చోటు చేసుకున్న న్యుమోనియా కేసుల పెరుగుదలతో ముడిపెట్టిన మీడియా నివేదికపై కేంద్ర ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. అది పూర్తిగా "తప్పుదోవ పట్టించేది , తప్పుడు సమాచారం" అని కొట్టిపారేసింది. ఇటీవల చైనాలో న్యుమోనియా కేసుల పెరుగుదలకు సంబంధించి ఢిల్లీలోని ఎయిమ్స్‌లో ఏడు బ్యాక్టీరియా కేసులను గుర్తించిందని ఓ జాతీయ దినపత్రిక కథనం వచ్చింది. అయితే అది పూర్తిగా తప్పుడు నివేదిక , తప్పుదారి పట్టించే సమాచారమని ప్రభుత్వం ఒక ప్రకటనలో పేర్కొంది.
చైనాతో సహా ప్రపంచంలోని పలు దేశాల్లో పిల్లలలో ఇటీవలి శ్వాసకోశ ఇన్ఫెక్షన్ల పెరుగుదలకు ఈ ఏడు కేసులకు ఎటువంటి సంబంధం లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఆరు నెలల వ్యవధిలో (ఏప్రిల్ నుండి సెప్టెంబర్ 2023) ఢిల్లీలోని ఎయిమ్స్‌లో కొనసాగుతున్న అధ్యయనంలో భాగంగా ఏడు కేసులు కనుగొనబడ్డాయని దీని గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రకటన తెలిపింది. జనవరి 2023 నుండి ఇప్పటి వరకు, ఎయిమ్స్‌లోని మైక్రోబయాలజీ విభాగంలో పరీక్షించిన 61 నమూనాలలో మైక్రోప్లాస్మా న్యుమోనియా కనుగొనబడలేదు.
మైకోప్లాస్మా న్యుమోనియా అనేది కమ్యూనిటీ-ఆర్జిత న్యుమోనియాలో అత్యంత సాధారణ బ్యాక్టీరియా కారణం. ఇది దాదాపు 15-30 శాతం ఇన్ఫెక్షన్లకు కారణం. భారత్‌లోని ఏ ప్రాంతంలోనూ ఇటువంటి కేసు నివేదించబడలేదు అని ప్రకటన పేర్కొంది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ.. రాష్ట్ర ఆరోగ్య అధికారులతో సంప్రదింపులు జరుపుతోందని.. ప్రతినిత్యం పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తోందని పేర్కొంది. మైకోప్లాస్మా న్యుమోనియా.. చైనాలోని పిల్లలలో ఇటీవలి కాలంలో పెరుగుతున్న శ్వాసకోశ వ్యాధి (న్యుమోనియా) కేసుల వ్యాప్తికి కారణమైన బ్యాక్టీరియా. ఈ ఏడాది ఏప్రిల్ - సెప్టెంబర్ మధ్య ఏడు నమూనాలలో న్యూఢిల్లీలోని ఎయిమ్స్ దానిని కనుగొన్నట్లు టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదించింది.
'లాన్సెట్ మైక్రోబ్'లో ప్రచురించిన నివేదికను టైమ్స్ ఆఫ్ ఇండియా ఉటంకించింది. సంక్రమణ ప్రారంభ దశలలో నిర్వహించిన పీసీఆర్ పరీక్ష ద్వారా ఒక కేసు కనుగొనబడిందని, IgM Elisa పరీక్ష ద్వారా మరో ఆరు కేసులు బయటపడినట్లుగా కథనంలో పేర్కొంది. COVID-19 తాజా వ్యాప్తి నేపథ్యంలో.. పిల్లలలో న్యుమోనియా కేసులతో చైనా ఆసుపత్రులు కిటకిటలాడుతున్నాయి. కేసుల పెరుగుదలకు ఎం-న్యుమోనియా బాక్టీరియా కారణమని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇది యూఎస్, యూకే, ఇజ్రాయెల్‌తో సహా ప్రపంచవ్యాప్తంగా విస్తరించింది. చైనాలో ప్రస్తుత పరిస్ధితుల నేపథ్యంలో భారత్‌లో అలర్ట్ చేసింది కేంద్రం. ప్రధాని ఢిల్లీలోని ఎయిమ్స్‌తో పాటు దేశంలోని ఇతర ప్రాంతాలలో వున్న ఆసుపత్రులలో వైరస్‌పై నిఘా పెట్టారు