అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కుటుంబంతో సహా తాజ్ మహల్ పర్యటనకు వచ్చిన విషయం తెలిసిందే. ట్రంప్ తన పర్సనల్ విజిట్ లో భాగంగా ఈ సుందరమైన తాజ్ మహల్ ని సందర్శించారు.

తాజ్ మహల్ ప్రత్యేకత గురించి ట్రంప్ దంపతులకు వివరించేందుకు భారత ప్రభుత్వం ప్రత్యేకంగా ఓ గైడ్ ని కూడా నియమించింది. అతనే నితిన్ కుమార్. అయితే  ఆ గైడ్ ని మెలానియా ట్రంప్ కొన్ని విషయాలను అడిగి తెలుసుకున్నారట. ఆ విషయాన్ని ఆ గైడ్ నితిన్ స్వయంగా వివరించారు.

Also Read ట్రంప్ తాజ్ పర్యటన: ఆ ప్రేమ చిహ్నం గురించి వివరిస్తున్న ఆ గైడ్ ఎంపిక ఎలా జరిగిందంటే..

‘‘తాజ్ మహల్ కథ, నిర్మాణం, దాని వెనుక కథ చెప్పాను. షాజహాన్, అతని భార్య ముంతాజ్ మహల్ కథ తెలుసుకున్న అధ్యక్షుడు ట్రంప్ చాలా ఎమోషనల్ అయ్యారు. తన సొంత కుమారుడు, ఔరంగజేబు అతన్ని ఎలా గృహ నిర్బంధంలో ఉంచారు మరియు అతని మరణం తరువాత ముంతాజ్ సమాధి పక్కన ఉన్న తాజ్ వద్ద ఇక్కడ ఖననం చేశారని చెప్పాను "అని కుమార్ విలేకరులతో అన్నారు.

గోపురం యొక్క చరిత్ర మరియు వాస్తుశిల్పం మరియు డిజైన్ వివరాల గురించి చెప్పినప్పుడు ఈ జంట చాలా ఆసక్తి చూపించారని ఆయన అన్నారు. 
"మెలానియా ట్రంప్ మట్టి ప్యాక్ చికిత్స గురించి అడిగారు మరియు ఈ ప్రక్రియ యొక్క వివరాలు తెలుసుకున్నప్పుడు ఆమె ఆశ్చర్యపోయింది" అని ఆయన చెప్పారు. 

ఇదిలా ఉండగా ట్రంప్ రాక కోసం అహ్మదాబాద్ నగరాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. నగర సుందరీకరణకు భారీగా ఖర్చు చేసారు. ట్రంప్ అహ్మదాబాద్ లో ఉండే మూడు గంటల కోసం దాదాపుగా 85 కోట్ల రూపాయలను వెచ్చించారు. ట్రంప్, మోడీలు విమానాశ్రయం నుంచే మొతేరా క్రికెట్ స్టేడియం కి వెళ్లే దారిలో ఉండే మురికివాడల ప్రాంతంలో 4 అడుగుల గోడను మునిసిపల్ అధికారులు నిర్మించారు.