చెన్నై: నాథూరామ్ గాడ్సేపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కమల్ హాసన్‌ నాలుక కోసేయాలని తమిళనాడుకు చెందిన మంత్రి కెటి రాజేంద్ర తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

సోమవారం నాడు రాజేంద్రన్  కమల్‌ చేసిన వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించారు. టెర్రరిజానికి మతాలతో సంబంధం ఉండదని ఆయన అభిప్రాయపడ్డారు.ఆదివారం నాడు ఎంఎన్ఎం చీఫ్, సినీ నటుడు కమల్ హాసన్ ఓ ఎన్నికల ప్రచార సభలో నాథూరామ్ గాడ్సే పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. 

తొలి తీవ్రవాది హిందూవేనని కమల్ వ్యాఖ్యానించారు. తాను  గాంధీ విగ్రహాం ముందు ఈ వ్యాఖ్యలు చేస్తున్నట్టుగా ఆయన చెప్పారు. ఈ ప్రాంతంలో ముస్లింలు ఎక్కువగా ఉన్నారని తాను ఈ వ్యాఖ్యలు చేయలేదని కూడ కమల్ ప్రకటించారు.

ఈ వ్యాఖ్యలు చేసిన కమల్‌హాసన్‌ పార్టీపై నిషేధం విధించాలని కూడ మంత్రి రాజేంద్ర డిమాండ్ చేశారు. కమల్ హాసన్ ప్రచారం చేయకుండా ఐదు రోజుల పాటు నిషేధం విధించాలని  బీజేపీ నేతలు ఈసీని కోరారు.