మధ్య ప్రదేశ్ ప్రభుత్వం మరోసారి సంక్షోభంలో పడింది. పీసీసీ చీఫ్ పోస్టు విషయంలో.. సీఎం కమల్‌నాథ్, ఎంపీ జ్యోతిరాదిత్య సింధియా మధ్య విబేధాలు తారా స్థాయికి చేరాయి. ఈ క్రమంలో కొందరు మంత్రులు, ఎమ్మెల్యేలను తీసుకొని వేరే ప్రాంతానికి తరలించారనే వార్తలు వెలువడుతున్నాయి.

కమల్ నాథ్ ప్రభుత్వాన్ని కూల్చడానికి జ్యోతిరాదిత్య సింథియా ప్రయత్నాలు చేస్తున్నాడంటూ వార్తలు వచ్చాయి. దీంతో కాంగ్రెస్ పెద్దలు జ్యోతిరాదిత్య సింథియాతో చర్చలు జరపడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే... అందుకు ఆయన అంగీకరించలేదన్నట్లు సమాచారం.

Also Read కమల్‌నాథ్ సర్కార్‌కు గండం: బెంగళూరుకు 17 మంది ఎమ్మెల్యేలు, సింధియా తిరుగుబాటు...

ఈ వార్త కథనాలపై తాజాగా... కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ స్పందించారు. తాము జ్యోతిరాదిత్య సింథియాతో మాట్లాడటానికి ప్రయత్నించామని చెప్పారు. అయితే... ఆయనకు స్వైన్ ఫ్లూ సోకిందని.. మాట్లాడలేకపోతున్నారని చెప్పారు.

‘‘మధ్యప్రదేశ్‌లో ఓటర్ల ఆదేశాన్ని అగౌరవపరిచేందుకు ఎవరు ప్రయత్నించినా.. వారికి రాష్ట్రంలోని ప్రజల నుండి తగిన సమాధానం లభిస్తుందని ఆయన అన్నారు. ప్రస్తుతానికి అయితే.. పరిస్థితి అంతా బాగానే ఉందని దిగ్విజయ్ సింగ్ పేర్కొన్నారు. 

అయితే... జోతిరాధిత్య సింథియా మాత్రం దాదాపు 17మంది ఎమ్మెల్యేలను తీసుకొని... బీజేపీ అధికారంలో ఉన్న కర్ణాటక రాష్ట్రానికి వెళ్లినట్లు సమాచారం. ఇక్కడ తనకు తగిన గుర్తింపు రావడం లేదని.. జ్యోతిరాదిత్య సింథియా... బీజేపీతో చేతులు కలిపేందుకు ప్రయత్నిస్తున్నారని తెలుస్తోంది. మరి ఆయన ప్రయత్నాలను కాంగ్రెస్ ఎలా అడ్డుకుంటుందో చూడాలి.