మహారాష్ట్రలో అత్యంత జనాదరణ పొందిన మరాఠీ మత బోధకుడు ఇందూరికర్ మహారాజ్ సంచలన కామెంట్స్ చేశారు. మగపిల్లాడు కావాలంటే శృంగారంలో ఇలాంటి మెళకువలు పాటించాలంటూ ఆయన  చేసిన కామెంట్స్ ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. బుధవారం ఆయన ఓ కార్యక్రమంలో పాల్గొంటూ ఈ విధమైన సూచనలు చేశారు.

Also Read అక్రమ సంబంధం.. భర్త ఒంటిపై మసిలే నూనె పోసిన భార్య...

సరిసంఖ్య తేదీల్లో భార్యభర్తలు కలయికలో పాల్గొంటే మగపిల్లాడు పుడతాడని.., అదే బేసీ సంఖ్య తేదీలో కలయికలో పాల్గొంటే ఆడపిల్ల పడుతుందని ఆయన పేర్కొన్నారు. దుర్ముహుర్తంలో భార్యభర్తలు శృంగారంలో పాల్గొంటే పుట్టిన బిడ్డ వల్ల కుటుంబానికి చెడ్డపేరు వస్తుంది అంటూ ఇందూరికర్ మహారాజ్ పేర్కొన్నారు.

కాగా... ఆయన చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కొందరు ఆయన చేసిన కామెంట్స్ పై తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.  కాగా.. మహారాజ్ చేసిన ఈ వ్యాఖ్యలపై ప్రీ-కాన్సెప్షన్, ప్రీ-నాటల్ డయాగ్నోస్టిక్ టెక్నిక్స్ (పీసీపీఎన్డీటీ) చట్టం యొక్క నిబంధనల ప్రకారం చర్య తీసుకుంటామని ప్రభుత్వ అధికారి హెచ్చరించారు