కర్ణాటక అసెంబ్లీ స్పీకర్ రమేష్ కుమార్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు. తనకు మగవారితో పడుకునే అలవాటు లేదంటూ.. ఆయన  చేసిన కామెంట్స్ ఇప్పుడు తీవ్ర కలకలం రేపుతున్నాయి.

పూర్తి వివరాల్లోకి వెళితే.. లోక్ సభ ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్ అధిష్టానం మునియప్పకు కోలార్ నియోజకవర్గం కేటాయించింది. ఇది నచ్చని రమేష్కుమార్.. మునియప్పపై విమర్శలు చేయడం మొదలుపెట్టారు. అప్పటి నుంచి ఏదో ఒక సందర్భంలో వీరి మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. అయితే..గత నెలలో ఓ కమ్యూనిటీ హాల్‌ ప్రారంభోత్సవానికి హాజరైన మునియప్ప రమేష్‌ కుమార్‌ను ఉద్దేశిస్తూ... మేమిద్దరం భార్యాభర్తల్లాంటి వాళ్లం. మా ఇద్దరి మధ్య ఎలాంటి గొడవలు లేవని స్పష్టం చేశారు.

తాజాగా ఈ వ్యాఖ్యలపై స్పందించిన మునియప్ప.. ‘నాకు పురుషులతోనే కాదు ఎవరితోనూ.. కలిసి నిద్రించే అలవాటు లేదు. నాకు భార్య ఉంది.. దశాబ్దాల క్రితమే ఆమెతో నాకు వివాహం జరిగింది. ఆయనకు నాతో కలిసి నిద్రపోవాలని ఉందేమో.. కానీ నాకు లేదు. అంతేకాక నాకు ఎవరితోను వివాహేతర సంబంధాలు కూడా లేవు’ అంటూ చెప్పుకొచ్చారు.