దేశవ్యాప్తంగా ఆదివారం డాటర్స్ డేని జరుపుకున్నారు. కూతురిపై తమకు ప్రేమను చాలా మంది తమదైన శైలిలో వ్యక్తపరిచారు. సాధారణ ప్రజలతోపాటు.. సెలబ్రెటీలు కూడా తమ కూతుళ్లపై తమకున్న ప్రేమను వ్యక్తపరిచారు. ఈ జాబితాలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కూడా ఉన్నారు.

తాజాగా... కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తన కూతురితో దిగిన ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఆ పిక్ లో నిర్మలా సీతారమన్ చాలా యంగ్ లుక్ లో ఉన్నారు. నలుపు రంగు చీర కట్టుకొని.. తన కుమార్తె వంగమాయి పరకాలను ఎత్తుకొని ఉన్నారు. వారి కుమార్తె వంగమాయి నీలం రంగు చొక్కా ధరించి ఉన్నారు. నిర్మలా యంగ్ లుక్ లోచాలా బాగున్నారు. తల్లీ కూతుళ్ల ఇద్దరి మధ్య ఉన్న ప్రేమ ఆ ఫోటోలో స్పష్టంగా కనపడుతోంది.

ఫోటోలో వారి వెనక కొండలు కూడా కనపడుతున్నాయి. ఉదయదం పూట ఆ ఫోటో తీసినట్లు తెలుస్తోంది.  ఈ ఫోటోకి ఆమె క్యాప్షన్ కూడా ఇచ్చారు. ‘‘ కూతుళ్ల గురించి చాలా చెప్పొచ్చు.’’ అంటూ క్యాప్షన్ పెట్టారు. అంతేకాకుండా తన కుమార్తె తనకు స్నేహితురాలు, ఫిలాసఫర్, మార్గనిర్దేషి అంటూ పేర్కొన్నారు. డాటర్స్ డే ని హ్యాష్ ట్యాగ్ చేసి.. అది త్రోబ్యాక్ పిక్ గా పేర్కొన్నారు. 

కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ కూడా డాటర్స్ డే సందర్భంగా ఫోటో ని సోషల్ మీడియాలో షేర్ చేశారు. తన 16ఏళ్ల కుమార్తె మిరయా వాద్రా ఫోటోని డాటర్స్ డే సందర్భంగా షేర్ చేశారు. ‘‘ ఈ రోజు డాటర్స్ డే అని అందరూ అంటున్నారు. కానీ నన్ను అడిగితే రోజూ డాటర్స్ డేనే అంటాను’ అంటూ క్యాప్షన్ ఇచ్చారు.