కశ్మీర్ కి ఉన్న స్వయం ప్రతిపత్తిని కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన సంగతి తెలిసిందే. కాగా... ఈ విషయంపై బీజేపీ మాజీ నేత యశ్వంత్ సిన్హా స్పందించారు. ఆర్టికల్ 370ని రద్దు అనంతరం ఒకవేళ ఎన్నికలు జరిగి ఉంటే రాజీవ్ గాంధీ రికార్డును బీజేపీ బద్దలు కొట్టేదని బీజేపీ మాజీ నేత యశ్వంత్ సిన్హా అన్నారు.

జమ్మూ కశ్మీర్‌కు దీనివల్ల జరిగే ప్రత్యేక ప్రయోజనం ఏమీ లేదని, ఐ నిర్ణయం పూర్తిగా రాజకీయ పరమైందని అన్నారు. ఆర్టికల్ 370 రద్దు జరిగిన మరుసటి రోజు ఎన్నికలు జరిగితే అని యశ్వంత్ సిన్హాను మీడియా ప్రశ్నించగా ‘‘ఇలా జరిగితే గనక 1984నాటి రాజీవ్ గాంధీ రికార్డును బీజేపీ బద్దలు కొట్టేది’’ అని వ్యాఖ్యానించారు.

ఇందిరా గాంధీ మరణం అనంతరం జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో రాజీవ్ గాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్ చారిత్రాత్మక విజయాన్ని సాధించింది. 1984లో జరిగిన ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ 414 లోక్‌సభ స్థానాలనుగెలుచుకుంది. స్వతంత్ర భారత చరిత్రలో ఇప్పటి వరకు ఏ పార్టీకి ఇన్ని స్థానాలు రాలేదు. ఇప్పుడు ఎన్నికలు జరిగితే.. మళ్లీ అదే రికార్డు స్థాయి స్థానాలు మోదీ గెలుచుకునే వారని ఆయన అభిప్రాయపడ్డారు.

ఇదిలా ఉండగా... కశ్మీర్ కి స్వయం ప్రతిపత్తిని కేంద్ర ప్రభుత్వం తొలగించింది. అదేవిధంగా జమ్మూ కశ్మీర్ ని రెండు భాగాలుగా విడగొట్టింది. అదేవిధంగా  కేంద్ర పాలిత ప్రాంతాలుగా ప్రకటించింది.