Asianet News TeluguAsianet News Telugu

కేజ్రీవాల్ ప్రధాని అవుతాడన్న బామ్మ.. ఆశీర్వాదం దక్కిందన్న ఢిల్లీ సీఎం

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు త్వరలోనే జరగనున్న నేపథ్యంలో ఢిల్లీలో ఆప్‌ ఓ సభ నిర్వహించింది. ఈ సభకు ఓ వృద్ధురాలు వచ్చింది.
 

"An Elderly Amma Blessed Me," Tweets Arvind Kejriwal, Shares Video
Author
Hyderabad, First Published Dec 28, 2019, 11:45 AM IST

ఢిల్లీ ఎన్నికలు దగ్గరపడుతున్నాయి. ఢిల్లీ పీఠం దక్కించుకోవడానికి అటు బీజేపీ... ఇటు కేజ్రీవాల్ తమ ప్రయత్నాలు తాము ముమ్మరంగా సాగిస్తున్నాయి. ఇప్పటికే ఎన్నికల ప్రచారాలు ఊపందుకున్నాయి. ఈ క్రమంలో ఓ వృద్ధురాలు కేజ్రీవాల్ ప్రధాని కావాలని తాను కోరుకుంటున్నట్లు చెప్పింది. కాగా... ఆమె చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి. తనకు ఓ తల్లి ఆశీర్వాదం దక్కిందంటూ కేజ్రీవాల్ ఆ వీడియోని షేర్ చేయడం గమనార్హం.

పూర్తి వివరాల్లోకి వెళితే... ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు త్వరలోనే జరగనున్న నేపథ్యంలో ఢిల్లీలో ఆప్‌ ఓ సభ నిర్వహించింది. ఈ సభకు ఓ వృద్ధురాలు వచ్చింది.

వేదికపై వెళ్లిన ఆ వృద్ధురాలు మాట్లాడుతూ.. అరవింద్‌ కేజ్రీవాల్‌ను ఎప్పట్నుంచో కలవాలి అనుకుంటున్నాను. ఆయనకు తన దీవెనలు ఇవ్వాలని కోరుకున్నాను. ఇప్పుడు ఆ అవకాశం వచ్చింది. ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ రాబోయే రోజుల్లో ప్రధాన మంత్రి అవుతారని ఆశిస్తున్నట్లు వృద్ధురాలు చెప్పింది. 

మంచి పనులు చేసిన వారందరికీ అరవింద్‌ లాంటి కొడుకు లభిస్తాడని ఆమె అభిప్రాయపడింది. చివరగా కేజ్రీవాల్‌ జిందాబాద్‌ అంటూ వృద్ధురాలు నినదించింది. ఈ సందర్భంగా వృద్ధురాలికి సీఎం కేజ్రీవాల్‌ పాదాభివందనం చేశారు. 

 

వృద్ధురాలు మాట్లాడిన వీడియోను కేజ్రీవాల్‌ తన ట్విట్టర్‌ పేజీలో పోస్టు చేశారు. ఓ తల్లి ఆశీర్వాదం తనకు దక్కిందని ఆయన పేర్కొన్నారు.  ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌ అయింది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలను 2020, జనవరి లేదా ఫిబ్రవరి నెలలో నిర్వహించే అవకాశం ఉంది.

Follow Us:
Download App:
  • android
  • ios