న్యూఢిల్లీ: దేశ ఆర్ధిక వ్యవస్థ తీవ్ర ఆందోళన కల్గిస్తోందని మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ అభిప్రాయపడ్డారు. ఈ పరిస్థితికి ప్రధాని మంత్రి అనుసరిస్తున్న విధానాలే కారణమన్నారు.

ఆరేళ్ల కనిష్టానికి జీడీపీ పడిపోయిన రెండు రోజుల తర్వాత మన్మోహన్ సింగ్ స్పందించారు.ప్రస్తుత ఆర్ధిక పరిస్థితికి మోడీ ప్రభుత్వ పనితీరే కారణమన్నారు. అసమర్ధత నిర్వహణ వల్లే దేశంలో ఈ పరిస్థితి నెలకొందన్నారు.

కేవలం వాహన రంగంలో 3.5 లక్షలు ఉద్యోగాలను కోల్పోవాల్సి వచ్చిందని  ఆయన చెప్పారు. ప్రభుత్వ విధానాల కారణంగానే దేశంలో  ఈ పరిస్థితి నె లకొందన్నారు. ఆదాయం విపరీతంగా పడిపోవడంతో రైతులు, వ్యవసాయ అనుబంధ రంగాల్లోని  ప్రజలు దుర్భర పరిస్థితులు ఎదుర్కొంటున్నారని ఆయన చెప్పారు.

చట్టబద్ద సంస్థల్ని నిర్వీర్యం చేసే ప్రయత్నం జరుగుతోందని మన్మోహన్ ఆరోపించారు. ప్రభుత్వానికి ఆర్బీఐ రూ. 1.76 కోట్ల నిధుల్ని బదిలీ చేయడాన్ని ఆయన ఆక్షేపించారు.