బర్త్ డే స్పెషల్... రాధే శ్యామ్ నుండి పూజా హెగ్డే లుక్... వైట్ ఫ్రాక్ లో ఏంజెల్ లా!
రాధే శ్యామ్ మూవీ టీమ్ Pooja hegde కు బెస్ట్ విషెష్ తెలియజేశారు. అలాగే మూవీ నుండి తన లుక్ విడుదల చేశారు.
స్టార్ లేడీ పూజా హెగ్డే నేడు పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. 1990 అక్టోబర్ 13న జన్మించిన పూజా హెగ్డే 31వ ఏట అడుగుపెట్టారు. రాధే శ్యామ్ మూవీ టీమ్ Pooja hegde కు బెస్ట్ విషెష్ తెలియజేశారు. అలాగే మూవీ నుండి తన లుక్ విడుదల చేశారు. విలాసవంతమైన భవంతిలో పూజా హెగ్డే, వైట్ గౌన్ ధరించి ఏంజెల్ లా ఉన్నారు. రాధే శ్యామ్ లో పూజా పాత్ర పేరు ప్రేరణ కాగా, లుక్ ఆసక్తిరేపుతోంది.
Radhe shyam షూటింగ్ ముగియగా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది. 2022 సంక్రాంతి కానుకగా జనవరి 14న గ్రాండ్ గా ఐదు బాషలలో రాధే శ్యామ్ విడుదల కానుంది. ఈ మేరకు చిత్ర యూనిట్ అధికారిక ప్రకటన చేశారు. మరోవైపు రాధే శ్యామ్ టీజర్ కోసం ఫ్యాన్స్ ఆతృతగా ఎదురుచూస్తున్నారు. రాధే శ్యామ్ అప్డేట్స్ విషయంలో ఫ్యాన్స్ పూర్తి నిరాశ వ్యక్తం చేస్తున్నారు. చిత్ర నిర్మాతలైన యూవీ క్రియేషన్స్ పై సోషల్ మీడియా వేదికగా నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు.
Also read టాప్ సీక్రెట్ లీక్ చేసిన హీరోయిన్ శ్రీయా శరణ్ ... ఆ సమయంలో రహస్యంగా ఆడపిల్లకు జన్మనిచ్చానంటూ...
దర్శకుడు రాధా కృష్ణ పీరియాడిక్ ఎమోషనల్ లవ్ డ్రామాగా రాధే శ్యామ్ తెరకెక్కిస్తున్నారు. సినిమా ప్రధాన భాగం ఇటలీ నేపథ్యంలో జరగనుంది. రాధే శ్యామ్ పునర్జన్మల కాన్సెప్ట్ తో సాగుతుందనే వాదన కూడా ఉంది. Prabhas పాత్రపై ఫ్యాన్స్ లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.రాధే శ్యామ్ చిత్రానికి జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందిస్తున్నారు. బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ భాగ్యశ్రీ ఓ కీలక రోల్ చేస్తున్నారు.
Also read తెలుగమ్మాయిగా గర్వంగా చెప్పుకుంటాః పూజా హెగ్డే.. `meb` ఈవెంట్‌లో ఈ అమ్మడి రచ్చ మామూలుగా లేదుగా..
ఇక రాధే శ్యామ్ తో పాటు తెలుగులో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్, ఆచార్య చిత్రాలలో పూజా హెగ్డే నటిస్తున్నారు. అఖిల్ హీరోగా తెరకెక్కిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ దసరా కానుకగా అక్టోబర్ 15న విడుదల కానుంది. ఇక ఆచార్య మూవీలో పూజా రామ్ చరణ్ కి జంటగా నటిస్తున్నారు. ఆచార్య చిత్రంలో పూజా పాత్రపై ప్రేక్షకులలో ఆసక్తి నెలకొని ఉంది. విజయ్ హీరోగా తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ మూవీ బీస్ట్ లో సైతం పూజా నటిస్తున్న విషయం తెలిసిందే. సల్మాన్ కి జంటగా కభీ ఈద్ కభీ దివాలి టైటిల్ తో పూజా భారీ బాలీవుడ్ చిత్రం చేస్తున్నారు.