టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా వెలుగొందిన కాజల్ అగర్వాల్.. బాలీవుడ్ లో కూడా కొన్ని చిత్రాల్లో నటించింది. గతంలో ఆమె 'దో లఫ్జోన్ కే కహానీ' అనే సినిమాలో నటించింది. ఇందులో ఆమె అంధురాలి పాత్ర పోషించింది. ఆమెకి జంటగా బాలీవుడ్ రణదీప్ హుడా నటించాడు. 2016లో విడుదలైన ఈ సినిమా ప్రేక్షకుల నుండి మిశ్రమ స్పందన లభించింది.

అయితే ఈ సినిమాలో రణదీప్ హుడాతో రొమాంటిక్ సన్నివేశాల్లో నటించడానికి చాలా ఇబ్బంది పడిందట కాజల్. ఈ విషయాన్ని ఆమె స్వయంగా వెల్లడించింది. నటి మంచు లక్ష్మీ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన్న ఓ రియాలిటీ షోలో కాజల్ పాల్గొంది. ఈ కార్యక్రమంలో భాగంగా మంచు లక్ష్మీ.. కాజల్ ని కొన్ని ప్రశ్నలు అడిగింది.

కార్తీ 'ఖైదీ' రివ్యూ!

'ఇప్పటివరకు మీరు నటించిన సినిమాల్లో ఏ నటుడితో రొమాన్స్ చేయడానికి ఇబ్బంది పడ్డారు' అని మంచు లక్ష్మీ అడగగా.. దానికి కాజల్ చెప్పిన సమాధానం హాట్ టాపిక్ గా మారింది. 'దో లఫ్జోన్ కే కహానీ' సినిమాలో రణదీప్ హుడా ఇంటిమేటెడ్ సీన్స్ లో నటించడానికి ఇబ్బంది పడినట్లు చెప్పుకొచ్చింది.

మాములుగా ప్రేమించిన వ్యక్తి కళ్లల్లోకి చూసి మనం ప్రేమను తెలియపరుస్తాం కానీ 'దో లఫ్జోన్ కే కహానీ' సినిమాలో తను అంధురాలి పాత్రను పోషించినట్లు.. ఇద్దరి మధ్య ప్రేమను చూపించడానికి కొన్ని రొమాంటిక్ సన్నివేశాలను చిత్రీకరించారని.. ఆ సమయంలో చాలా ఇబ్బంది పడినట్లు చెప్పుకొచ్చింది కాజల్. 

తనకు తెలియని వ్యక్తితో అటువంటి సన్నివేశాలలో నటించడం చాలా ఇబ్బందిగా అనిపించిందని కాజల్ వెల్లడించింది. ఇక సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం కాజల్.. 'ముంబై సాగా', 'ఇండియన్ 2' చిత్రాల్లో నటిస్తున్నారు.