అమరావతి:త్వరలో ఏపీలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు రానున్నాయి. ఈ ఎన్నికల్లో ఓటర్లను ఆకర్షించేందుకు వైసీపీ కొత్త నినాదాన్ని ఎత్తుకుంది.. 

నిన్ను నమ్మను బాబు అంటూ వైసీపీ ప్రచారాన్ని నిర్వహిస్తోంది. గత ఎన్నికల సందర్భంగా ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో టీడీపీ వైఫల్యం చెందిందని వైసీపీ నేతలు  ఆరోపణలు గుప్పిస్తున్నారు.

గత ఎన్నికల సమయంలో బాబు అధికారంలోకి వస్తే జాబు వస్తోందని టీడీపీ ప్రచారం చేసిన విషయాన్ని  వైసీపీ గుర్తు చేస్తోంది. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఉన్న ఉద్యోగాలు పోయాయని వైసీపీ  విమర్శలు గుప్పిస్తోంది.

ఈ తరుణంలోనే  గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయనందుకుగాను నిన్ను నమ్మను బాబు అంటూ వైసీపీ ప్రచారాన్ని ప్రారంభించింది. తాను అమలు చేసే వాగ్ధానాలనే ప్రజలకు ఇస్తున్నట్టుగా జగన్ ప్రకటించారు.

అమలు చేయలేని హామీలను ఇస్తే తాను 2014 ఎన్నికల్లోనే తమ పార్టీ అధికారంలోకి వచ్చేదని వైసీపీ నేతలు పదే పదే  చెబుతున్నారు.ఇదిలా ఉంటే జగన్ అన్న పిలుపు అంటూ వైసీపీ  నినాదాన్ని ప్రజల ముందుకు  తీసుకొచ్చింది. జగన్ అన్న పిలుపు పేరుతో ప్రజల్లోకి విస్తృతంగా వెళ్లాలని ఆ పార్టీ భావిస్తోంది.