హైదరాబాద్: సార్+ కారు = ఢిల్లీ సర్కార్  అంటూ టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అభిప్రాయపడ్డారు. టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో కేటీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారు.

వచ్చే ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రం నుండి 16 ఎంపీ స్థానాల్లో టీఆర్ఎస్ అభ్యర్ధులను గెలిపించాలని కేటీఆర్ కోరారు.కాంగ్రెస్, బీజేపీలకు ఈ దేశంలో పూర్తిస్థాయి మెజారిటీ వచ్చే అవకాశం లేదని కేటీఆర్ జోస్యం చెప్పారు. 

సార్(కేసీఆర్)+ కారు = ఢిల్లీ సర్కార్  ఏర్పాటయ్యే అవకాశం ఉందని  కేటీఆర్ చెప్పారు. ఇటీవల కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ స్థాయి టీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో ఆయన  ఈ వ్యాఖ్యలు చేశారు. 

ఈ దఫా ఎన్నికల్లో  రాష్ట్రంలోని  16 ఎంపీ స్థానాలను కైవసం చేసుకోవడం ద్వారా  ఫెడరల్ ఫ్రంట్ ద్వారా కేంద్రంలో ప్రధానిని నిర్ణయించడంలో కీలకంగా వ్యవహరించాలని కేసీఆర్ భావిస్తున్నారు. హైద్రాబాద్ ఎంపీ స్థానం మినహా మిగిలిన 16 ఎంపీ స్థానాలను కైవసం చేసుకోవడం ద్వారా  దేశ రాజకీయాల్లో చక్రం తిప్పవచ్చని  కేసీఆర్  భావిస్తున్నారు.