న్యూఢిల్లీ: బీజేపీ  చెబుతున్న స్లోగన్స్‌కు కాంగ్రెస్ కూడ అదే స్థాయిలో కౌంటరిస్తోంది. ఐదేళ్లలో మోడీ పాలనలో దేశం ఏ రకంగా నష్టపోయిందనే విషయమై  ఆ పార్టీ ప్రజల్లోకి విస్తృతంగా  ప్రచారం చేస్తోంది.

పాంచ్ సాల్ దేశ్ బే హాల్ అనే నినాదాన్ని కాంగ్రెస్ ప్రచారం చేస్తోంది. ఐదేళ్లలో దేశం పరిస్థితి బాగా లేదంటూ  కాంగ్రెస్ విస్తృతంగా ప్రచారం చేస్తోంది. మరో వైపు రాఫెల్ యుద్ధ విమానాల డీల్‌లో  అవకతవకలు చోటు చేసుకొన్నాయని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తూ చౌకీదార్ చోర్ హై అంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తోంది.

తుమ్మారీ జూఠ్ సబ్‌సే మజ్‌బూత్ అంటూ కాంగ్రెస్ పార్టీ బీజేపీపై ఎదురు దాడికి దిగుతోంది. రాఫెల్ డీల్‌తో పాటు ఈ ఐదేళ్లలో బీజేపీ చేపట్టిన కార్యక్రమాలకు సంబంధించి అబద్దాలను నిజాలుగా ప్రచారం చేస్తున్నారని కాంగ్రెస్ మండిపడుతోంది. వాస్తవాలను ప్రజలకు తెలియకుండా మరుగునపడేలా చేస్తున్నారని కాంగ్రెస్ ఆరోపిస్తోంది.

భారత్ వెలిగిపోతోందని బీజేపీ చేస్తున్న ప్రచారానికి కాంగ్రెస్ కౌంటరిస్తున్నారు. భారత్ వెలిగిపోతోందనే దానికి భారత్ తల్లడిల్లిపోతోందని ప్రచారం చేస్తున్నారు.