న్యూఢిల్లీ: బీజేపీ హిందూత్వానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ హిందూత్వంతోనే చెక్ పెట్టే ప్రయత్నం చేస్తోంది. బీజేపీ ఎత్తుకొన్న నినాదాలకు అదే నినాదాలతో కాంగ్రెస్ పార్టీ ఎదురుదాడికి దిగుతోంది.

హర్‌హర్ మోడీ ఘర్ ఘర్ మోడీ అంటూ బీజేపీ  నినాదాన్ని తెచ్చింది. మోడీ గతంలో  కేదార్ నాథ్‌లో  తపస్సు చేసినందున ఈ నినాదాన్ని ఆ పార్టీ తీసుకొచ్చింది. అదే సమయంలో హిందూత్వం కూడ ఈ నినాదానికి కలిసొచ్చింది. మరో వైపు ఇదే నినాదానికి కాంగ్రెస్ పార్టీ హిందూత్వాన్ని లింక్ చేస్తూ కౌంటర్ ఇచ్చింది

బోలో భం... అంటూ కాంగ్రెస్ పార్టీ మోడీకి కౌంటర్ ఇచ్చింది. కైలాస సరోవర్ యాత్రను రాహుల్ వెళ్లాడు. దీంతో  బోలో భం అంటూ కాంగ్రెస్ బీజేపీని కౌంటర్ చేయడం ప్రారంభించింది. ముల్లును ముల్లుతోనే తీయాలనే కాన్సెప్ట్ లో భాగంగా కాంగ్రెస్ ఈ నినాదాన్ని తీసుకొంది.

హిందూత్వ ఎజెండాలో గతంలో  రాముడు ప్రధానంగా కన్పించేవాడు. అయితే ఈ దఫా  రెండు పార్టీలు రాముడికి బదులుగా శివుడిని వాడుకొన్నారు. రాహుల్ గాంధీ గుజరాత్ ఎన్నికల ప్రచారానికి ముందు, ఎన్నికల ప్రచారంలో కూడ ప్రధాన దేవాలయాలకు వెళ్లడం విశేషం