ఆవనూనెతో చేసిన వంటలతో.. బరువు తగ్గొచ్చా?

మీ రోజువారీ ఆహారంలో  చేర్చగలిగి, సురక్షితంగా ఉండే నూనె ఏదైనా ఉందా? అంటే నిపుణులు ఉందని చెబుతున్నారు. మీ రోజువారీ వంటల్లో ఆవనూనె ను ఉపయోగించడం వల్ల మీ బరువు తగ్గే ప్రయత్నంలో ఇది సహాయపడుతుంది.   ​Mustard oil ఆరోగ్యకరమైన నూనె. మరి మీ weight lossలో ఇది ఎలా సహాయపడుతుంది? దీంట్లోని సుగుణాలేంటో ఒకసారి చూద్దాం. 

Can cooking meals in mustard oil aid weight loss?

వెయిట్ లాస్ కోసం ప్రయత్నిస్తున్నప్పుడు వ్యాయామం ఎంత ముఖ్యమో, ఆహారం విషయంలో జాగ్రత్తలూ అంతేముఖ్యం. ముఖ్యంగా వంటకు ఉపయోగించే నూనెల విషయంలో చాలారకాల అనుమానాలు ఉంటాయి. ఎలాంటి రకం నూనె వాడాలి.. ఏది మంచిది? ఏది చెడుది? ఏ నూనె బరువు తగ్గే క్రమంలో ఉపయోగపడుతుంది అనే విషయం తేల్చుకోలేకపోతారు. 

Can cooking meals in mustard oil aid weight loss?

మీ రోజువారీ ఆహారంలో  చేర్చగలిగి, సురక్షితంగా ఉండే నూనె ఏదైనా ఉందా? అంటే నిపుణులు ఉందని చెబుతున్నారు. మీ రోజువారీ వంటల్లో ఆవనూనె ను ఉపయోగించడం వల్ల మీ బరువు తగ్గే ప్రయత్నంలో ఇది సహాయపడుతుంది.   ​Mustard oil ఆరోగ్యకరమైన నూనె. మరి మీ weight lossలో ఇది ఎలా సహాయపడుతుంది? దీంట్లోని సుగుణాలేంటో ఒకసారి చూద్దాం. 

బరువు తగ్గడానికి ఆవ నూనె వాడితే.. ఇది మీ జీవక్రియను వేగవంతం చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. ప్రధానంగా నియాసిన్, రిబోఫ్లేవిన్ వంటి B- కాంప్లెక్స్ విటమిన్లు ఉండటం వలన, ఇది ఆహారాన్ని త్వరగా జీర్ణం చేయడంలో సహాయపడుతుంది. ఈ ప్రక్రియ మరింత బరువు తగ్గడానికి దారితీస్తుంది.

చాలా మంది ఆవ నూనెను వాడడానికి ఇష్టపడరు. దీనికి కారణం ఆవనూనె కాస్త మందంగా ఉంటుంది, జిగటగా ఉంటుంది. బలమైన వాసన కలిగి ఉంటుంది. అయితే ఇది వేడి చేసేవరకే.. కానీ ఒకసారి సరిగ్గా వేడి చేసినప్పుడు, ఆవనూనె కూడా ఇతర నూనెలాగే అవుతుంది. mustard oilలో ఒమేగా -3, ఒమేగా -6 కొవ్వు ఆమ్లాలు, ఇతర గుండె-ఆరోగ్యకరమైన కొవ్వులు చాలా ఉంటాయి. దీంట్లోని ఆరోగ్యకరమైన కొవ్వు ఆమ్లాల కలయిక ఆహార రుచిని మెరుగుపరచడమే కాకుండా రక్తంలో కొవ్వు స్థాయిని తగ్గిస్తుంది. ఒమేగా -6 కొవ్వు ఆమ్లాలు సహజంగా శరీరంలో నిల్వ ఉండే brown fats వాడకాన్ని పెంచుతుంది. ఇవి బరువు తగ్గడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి.

Can cooking meals in mustard oil aid weight loss?

ఆవనూనె ప్రయోజనాలు
బరువు తగ్గడమే కాకుండా, ఆవ నూనె వల్ల అనేక ప్రయోజనాలను కలిగిస్తుంది. ఆవనూనె గురించి చెప్పుకునేటప్పుడు వీటిని నిర్లక్ష్యం చేయలేం. ఆవనూనెలో మోనోశాచురేటెడ్, బహుళ అసంతృప్త కొవ్వులు ఉంటాయి, ఇది గుండెకు ఆరోగ్యకరమైనది. మంచి కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచడంలో సహాయపడుతుంది.

Can cooking meals in mustard oil aid weight loss?

గ్లూకోసినోలేట్ ఉన్నందున ఆవ నూనె కూడా anti-cancer propertiesను కలిగి ఉందని చెప్పబడింది. ఈ సమ్మేళనం కొలొరెక్టల్, గ్యాస్ట్రోఇంటెస్టినల్ వంటి క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. వంట చేయడమే కాకుండా, ఆవనూనెను అనేక రకాలుగా ఉపయోగిస్తారు. వెచ్చని ఆవనూనెతో కీళ్ల నొప్పులు ఉన్న దగ్గర మసాజ్ చేయడం, దీనివల్ల కీళ్ల నొప్పులు, అసౌకర్యం బాగా తగ్గుతుంది. వెచ్చని ఆవాల నూనెను పాదాలు, ఛాతి భాగంలో మర్దన చేయడం వల్ల చలికాలంలో ఛాతీలో బరువుగా ఉండడాన్ని తగ్గించవచ్చని చాలా మంది చెబుతుంటారు.

Can cooking meals in mustard oil aid weight loss?

బాటమ్‌లైన్
ఏదైనా ఎక్కువగా వాడితే మంచిది కాదు.. అది ఆవనూనె విషయంలోనూ వర్తిస్తుంది. మంచిది కదా అని ఎక్కువగా వాడితే అది నెగటివ్ ప్రభావాన్ని చూపిస్తుంది. ఆవ నూనెలో వేయించిన ఆహారాన్ని మీకు వీలైనంత వరకు మానుకోవాలి. మీ కూరగాయలను వంట చేసేటప్పుడు, ఆవ నూనెను కొద్ది మొత్తంలో వాడాలి. ఇది ఆహారాన్ని వండడానికి సరిపోతుంది.

అలాగే, మీరు ముందుగా ఆవ నూనెను సరిగ్గా వేడి చేసిన తరువాతే వాడాలి. నూనెను పచ్చిగా ఉన్నప్పుడు ఉపయోగించవద్దు. మస్టర్డ్ ఆయిల్ smoking point కు చేరుకునే వరకు వేడి చేయాలి. అప్పుడే ఆవనూనె లోని గరిష్ట ప్రయోజనాలు పొందడం కుదురుతుంది. 

ఏకాలంలో బరువు తగ్గడం సులువు..?

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios