ఈ వీర్యంతో తయారు చేసిన ఫుడ్స్ రుచి చాలా బాగున్నాయని జనాలు ఎగబడి మరీ తింటున్నారట. ఈ సంప్రదాయం ప్రస్తుతం విదేశాల్లో కొనసాగుతోంది. ఇంకా మనదేశంలో ఈ సంప్రదాయం రాకపోవడం గమనార్హం.
సంతానోత్పత్తికి పురుషుల వీర్యం అవసరం అన్న విషయం జగమెరిగిన సత్యం. ఈ వీర్య కణాల సంఖ్య తక్కువ సంఖ్యలో ఉంటే.. వారికి సంతానం కలిగే అవకాశం ఉండదు. ఇది కూడా మనకు తెలసు. అందుకే చాలా మంది వీర్యకణాల సంఖ్య పెంచుకోవడానికి తగిన ఆహారం తీసుకుంటూ ఉంటారు. కొన్ని రకాల ఆహారాలు తీసుకుంటే.. వీర్యం వృద్ధి బాగా జరుగుతుందని పెద్దలు, నిపుణులు అంటారు. కానీ... అదే పురుషుల వీర్యాన్ని వినియోగించి.. రుచికరమైన వంటకాలు తయారు చేస్తారన్న విషయం మీకు తెలుసా?
నమ్మడానికి కష్టంగా.. వినడానికి జుగుప్సాకరంగా ఉన్నప్పటికీ ఇది అక్షర సత్యం. ఈ వీర్యంతో తయారు చేసిన ఫుడ్స్ రుచి చాలా బాగున్నాయని జనాలు ఎగబడి మరీ తింటున్నారట. ఈ సంప్రదాయం ప్రస్తుతం విదేశాల్లో కొనసాగుతోంది. ఇంకా మనదేశంలో ఈ సంప్రదాయం రాకపోవడం గమనార్హం.
లండన్ లో విదేశీ చెఫ్ లు ఇప్పుడు పరుషుడి వీర్యంతో రకరకాల వంటలు తయారు చేస్తున్నారు. ఆ ఫుడ్ ని భోజన ప్రియుల చేత తినిపించి ఆహా అనిపించుకుంటున్నారు. ముఖ్యంగా వీర్యంతో మోచో మొజిటో, క్రీప్స్, బీబీ క్యూ సాష్, క్రీమ్ కారామిల్ వంటి వంటకాలను ఎక్కువగా తయారు చేస్తున్నారు. అయితే వీటికి అధిక స్థాయిలో కాకుండా ఒకటి, రెండు టేబుల్ స్పూన్ల వీర్యం మాత్రమే కలిపి విభిన్నమైన ఫ్లేవర్ తీసుకువస్తున్నారు.
దీని గురించి ఆ చెఫ్ లు మాట్లాడుతూ.. ‘ వీర్యం కూడా చక్కని పోషక పదార్థమే. అది కడుపులోకి వెళ్లినంత మాత్రాన ఏలాంటి ప్రభావం ఉండదు. అయితే.. వీర్యంతో వంటకాలను ఎవరూ ఇంట్లో ప్రయత్నించకూడదు. ఎందుకంటే వీర్యం ద్వారా హెచ్ఐవీ, ఎస్టీవీ వంటివి సంక్రమించే ప్రమాదం ఉంది. మేం ప్రత్యేక పద్ధతుల ద్వారా వీర్యాన్ని వేడిచేసి దానిని ప్రమాద రహితంగా మారుస్తాం’ అని వారు చెబుతున్నారు.
కాగా... ఈ వంటకాలను తయారు చేయడానికి వీర్యం ఉపయోగించినట్లు ముందుగానే కష్టమర్లకు తెలియజేస్తామని.. వారికి నచ్చితేనే ఆ ఆహారం తీసుకుంటారని వారు చెబుతున్నారు.
Read Exclusive COVID-19 Coronavirus News updates, from Telangana, India and World at Asianet News Telugu.
వర్చువల్ బోట్ రేసింగ్ గేమ్ ఆడండి మిమ్మల్ని మీరు ఛాలెంజ్ చేసుకోండి ఇప్పుడే ఆడటానికి క్లిక్ చేయండి
Last Updated Aug 14, 2019, 3:44 PM IST