Asianet News TeluguAsianet News Telugu

రొమాంటిక్ కపుల్స్ ఈ పొజీషన్ లోనే ఎక్కువగా పడుకుంటారు.. ఎందుకంటే?

world sleep day:  మంచి నిద్రతో పాటుగా.. మంచి సంబంధం కోసం స్లీపింగ్ పొజీషన్ కూడా ముఖ్యమేనంటున్నారు నిపుణులు. ఒకరంటే ఒకరికి అమితమైన ఇష్టం ఉండేవారు ఏ భంగిమలో నిద్రపోవడానికి ఇష్టపడతారనే విషయంపై ప్రపంచవ్యాప్తంగా ఎన్నో పరిశోధనలు జరిగాయి. 

world sleep day: why most romantic couples like spooning position to sleep together
Author
First Published Mar 17, 2023, 11:07 AM IST


world sleep day:  మంచి నిద్ర ప్రతి ఒక్కరికీ చాలా అవసరం. ఆరోగ్యకరమైన శరీరానికి, మనస్సుకు నిద్ర అవసరం. ఈ నిద్ర భాగస్వాముల మధ్య మంచి సంబంధానికి కూడా అవసరమే మరి. ముఖ్యంగా స్లీపింగ్ పొజీషన్. స్లీపింగ్ పొజిషన్ సరిగా లేకపోతే భాగస్వామితో రిలేషన్ షిప్ కూడా దెబ్బతింటుందని నిపుణులు చెబుతున్నారు. 

ప్రపంచ నిద్ర దినోత్సవం 

మంచి నిద్ర ప్రాముఖ్యత గురించి ప్రజలకు తెలియజేయడానికి వరల్డ్ స్లీప్ డే ను ప్రతి ఏడాది మార్చి 17 న జరుపుకుంటారు. తీవ్రమైన నిద్ర సమస్యలతో పోరాడుతున్న ప్రజలకు సహాయపడటం దీనిముఖ్య ఉద్దేశ్యం. ఈ దినోత్సవాన్ని 2008 నుంచి జరుపుకుంటున్నారు. ప్రపంచ నిద్ర దినోత్సవం నినాదం మంచి నిద్ర, మెరుగైన జీవితం.

వెన్నునొప్పిని నివారించడానికి వీపుపై నేరుగా పడుకోవాలని నిపుణులు చెబుతున్నారు. మెడ, మోకాళ్ల కింద సపోర్టింగ్ దిండు పెడితే వెన్ను నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది. ఈ పొజీషన్ కుడి వెన్నెముక అమరికకు మంచిది. కాళ్ళను నిటారుగా చేయడం లేదా మోకాళ్ల మధ్య దిండు ఉంచడం ద్వారా హాయిగా నిద్రపడుతుంది. అదే కడుపుపై పడుకోవడం వల్ల వెన్నెముక కండరాలపై అనవసరమైన ఒత్తిడి పడుతుందని. దీనివల్ల వెన్ను, మెడ నొప్పి వస్తుందని నిపుణులు చెబుతున్నారు. 

జంటలకు సరైన నిద్ర భంగిమ 

జర్మనీలోని హైడెల్‌బర్గ్ విశ్వవిద్యాలయంలో 31 సంవత్సరాల నుంచి 100 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సున్న జంటల స్లీపింగ్ పొజీషన్ పై ఒక అధ్యయనం జరిగింది. ఐరీన్ జంకర్, జూలియా బెర్గెల్ అనే పరిశోధకుల బృందం నిర్వహించిన ఈ అధ్యయనం ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ డ్రీమ్ రీసెర్చ్‌లో కూడా ప్రచురించబడింది. స్పూనింగ్, ఛేజింగ్ స్పూన్, బ్యాక్ టు బ్యాక్, ఫ్రంట్ టు ఫ్రంట్, క్రేడిల్, లెగ్ హగ్ వంటి జంటల మధ్య ఉపయోగించే నిద్ర భంగిమలను వీరు అధ్యయనం చేశారు. చాలా మంది జంటలు ఇష్టపడే స్లీపింగ్ పొజీషన్  స్పూనింగ్  స్లీపింగ్ పొజీషన్. 44 శాతం జంటలు ఈ పొజీషన్ లోనే నిద్రపోవడానికి ఇష్టపడతారట. ఈ పొజీషన్ తో ఇద్దరి మధ్య గొడవలు తగ్గుతాయని, మంచి గాఢ నిద్ర ఉందని జంటలు చెప్పారట. రిలేషన్ షిప్ బంధం కూడా మునుపటి కంటే మెరుగ్గా ఉందని వెల్లడించారట.

స్పూనింగ్ స్లీపింగ్ పొజిషన్ అంటే ఏమిటి?

ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎక్కువ జంటలు ఈ పొజీషన్ నే ఎక్కువగా ఇష్టపడతారట. ఈ స్లీపింగ్ పొజీషన్ రిలేషన్ షిప్ లో భద్రత, సౌకర్యాన్ని సూచిస్తుంది. ఇందులో భాగస్వాములు ఇద్దరూ ఒకే దిశలో నిద్రపోతారు. అంటే భాగస్వామిని వెనకు నుంచి హగ్ చేసుకుని పడుకుంటారు. ఇది సేఫ్టీని సూచిస్తుంది. ఈ భంగిమలో ఒక భాగస్వామి మరొకరి వైపు లేదా వెనుక కొద్దిగా వంగి ఉంటారు. దీనిలో స్పర్శ వల్ల భావోద్వేగ, శారీరక సౌకర్యాన్ని అందిస్తుంది. మంచి రిలేషన్ షిప్ లో ఉన్నవారు నిద్రపోతున్నప్పుడుు ఒకరికొకరు దగ్గరగా ఉండాలని కోరుకుంటారు. 42 శాతం మంది ఒకరికొకరు దగ్గరగా ఆనుకుని పడుకుంటారు. 31% జంటలు ఒకే దిశకు ఎదురుగా ఉన్న స్పూనింగ్ పొజిషన్ లో నిద్రపోతారు. కేవలం 4% జంటలు మాత్రమే ఒకరికొకరు ఎదురెదురుగా పడుకుంటారు. చివరిరగా మంచి సంబంధం ఉన్న భాగస్వాములు ఒకరికొకరు దగ్గరగా ఉండాలని కోరుకుంటారని నివేదించారు.

Follow Us:
Download App:
  • android
  • ios