Asianet News TeluguAsianet News Telugu

Women Care : పిల్లలు పుట్టని మహిళలకే గుండెపోటు ఎక్కువగా వస్తుంది.. అధ్యయనంలో వెల్లడి..

Women Care : పిల్లలు పుట్టని మహిళలే గుండె సమస్యలతో ఎక్కువగా బాధపడే అవకాశం ఉందని తాజా అధ్యయనం వెల్లడిస్తోంది. ఇలాంటి పరిస్థితిలో ఆరోగ్యం పట్ల  తగిన జాగ్రత్తగా ఉండాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. 
 

women who are unable to become mothers are at higher risk of heart attack
Author
Hyderabad, First Published May 6, 2022, 5:01 PM IST

Women Care : తల్లి కావడం ప్రతి మహిళ జీవితంలో ఒక ముఖ్యమైన దశ. అది మాటల్లో చెప్పలేని గొప్ప అనుభూతి. కానీ ఈ రోజుల్లో మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్ల కారణంగా ఎంతో మంది ఆడవారు తల్లులు కాలేకపోతున్నారు. ఒకరిద్దరు కాదు ఈ సమస్యతో ఎంతో మంది ఆడవారు బాధపడుతున్నారు. 

ఇక సంతాన లేమి కారణంగా మహిళలు మానసికంగా క్రుంగిపోతుంటారు. కానీ తాజా అధ్యయనం మరో షాకింగ్ విషయాన్ని వెళ్లడించింది. వంధ్యత్వం ఉన్న మహిళలు గుండెపోటుతో బాధపడుతున్నారని పరిశోధనలో వెల్లడైంది. 

అమెరికన్ కాలేజ్ ఆఫ్ కార్డియాజీ జర్నల్ లో ఈ పరిశోధన ఫలితాలు ప్రచురించబడ్డాయి. ఈ పరిశోధన ప్రకారం.. పిల్లలు ఉన్న మహిళల కంటే వంధ్యత్వం ఉన్న మహిళలకే గుండె ఆగిపోయే అవకాశం 16 శాతం ఎక్కువగా ఉందట. అలాగే గర్బధారణ సమయంలో సమస్యలు ఎదుర్కొన్న మహిళలకు భవిష్యత్తులో గుండె జబ్బులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందని నివేదిక వెల్లడిస్తుంది. పరిశోధకులు రెండు రకాల గుండె వైఫల్యాన్ని అధ్యయనం చేశారు. 

గుండె వైఫల్యంలో రెండు రకాలు.. రక్తాన్ని పంప్ చేసిన తర్వాత గుండె కండరాలు పూర్తిగా విస్తరించలేవు. అలాంటి సమయంలోనే గుండెపోటు వస్తుంది. ప్రతి బీట్ తర్వాత శరీరానికి వెళ్లాల్సిన రక్తం మొత్తం గుండె దిగువ భాగానికి వెళ్లలేకపోతుంది. మహిళల్లో గుండె వైఫల్యానికి  HFpEF కారణం. 

గర్బధారణ సమస్యలుల ఉన్న మహిళలు అధిక రక్తపోటు సమస్యతో బాధపడే అవకాశం ఉంది. పిల్లలు పుట్టడం పుట్టకపోవడం మీ చేతిలో లేని పని. కానీ దీనివల్ల గుండె సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అలాంటి మహిళలు ఆరోగ్యం పట్ల  మరింత జాగ్రత్తగా ఉండాలి. 

వంధ్యత్వం అంటే ఏమిటీ.. ఏదైనా కారణం చేతనో లేకపోతే ఏదైనా లోపం వల్లో గర్బం ధరించపోతే దాన్ని వంధ్యత్వం అంటారు. 

వంధ్యత్వానికి కారణం.. స్త్రీల శరీరంలో హార్మోన్ల అసమతుల్యత వల్ల కూడా వంధ్యత్వానికి దారి తీస్తుంది. శరీరంలో సాధారణ హార్మోన్లలో మార్పులు లేనప్పుడు అండాశయాల నుంచి ఎగ్స్ రిలీజ్ కావు. దీనికి కారణం ఒత్తిడి, వయసు, ఆధునిక జీవన శైలి మొదలైనవి. గర్భంలో పాలిప్స్, నియోప్లాజమ్స్, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ వంటి సమస్యలు ఉంటే గర్భధారణ సమయంలో ఇబ్బంది కలుగుతుంది. 

వంధ్యత్వం లక్షణాలు.. మహిళ రుతుచక్రం 35 రోజులు లేదా అంతకంటే ఎక్కువ రోజులు ఉంటే అది వంధ్యత్వానికి లక్షణం కావొచ్చు. అలాగే కొన్ని రోజుల్లేనే రుతుస్రావం లేదా 21 రోజుల ముందే రుతుస్రావం ప్రారంభం కావడాన్ని అపక్రమ రుతుస్రావం అంటారు. ఇది కూడా వంధ్యత్వానికి దారితీస్తుంది. 

వంధ్యత్వాన్నిఎలా నివారించాలి.. రుతుస్రావం లో ఏదైనా మార్పుకనిపిస్తే వెంటనే  వైద్యుడిని సంప్రదించండి. అలాగే సమతుల్య ఆహారం తీసుకోండి. జంక్ ఫుడ్, వేయించిన ఆహారాలకు దూరంగా ఉండండి. ప్రతిరోజూ ఉదయం ఒక అరగంట పాటు వ్యాయామం చేయండి. ముఖ్యంగా ఒత్తిడికి దూరంగా ఉండాలి.   

Follow Us:
Download App:
  • android
  • ios