కండోమ్ వద్దే వద్దు..అమ్మాయిల వాదన ఇది

https://static.asianetnews.com/images/authors/d7f5adfb-1610-5d53-be8e-55db5850d97e.jpg
First Published 12, Apr 2019, 4:32 PM IST
Women Don't Like How Condoms Feel Any More Than Men Do
Highlights

కండోమ్... సురక్షిత శృంగారానికి సహకరిస్తుంది. అంతేకాదు.. ఎయిడ్స్‌, సుఖ వ్యాధులకు అడ్డుకట్ట వేసేది కూడా కండోమే.  గర్భనిరోధకానికి ఇది అత్యుత్తమ కవచం. 

 కండోమ్... సురక్షిత శృంగారానికి సహకరిస్తుంది. అంతేకాదు.. ఎయిడ్స్‌, సుఖ వ్యాధులకు అడ్డుకట్ట వేసేది కూడా కండోమే.  గర్భనిరోధకానికి ఇది అత్యుత్తమ కవచం. అయినా మెజారిటీ ప్రజలు కండోమ్‌ వద్దే వద్దని అంటున్నారు. శృంగార సమయంలో సంతృప్తి, భావప్రాప్తికి కండోమ్‌ను అడ్డుగా భావిస్తున్నారు.

 గర్భం రాకుండా ఉండేందుకు పిల్స్‌, కాపర్‌ టీ ఇంజెక్షన్లు, ట్యుబెక్టమీ, వెసక్టమీ వంటి ప్రత్యామ్నాయ పద్ధతులకే మొగ్గు చూపుతున్నారు తప్ప భావప్రాప్తి విషయంలో రాజీపడట్లేదు. ఫలితంగా ఈ ఆరేళ్ల కాలంలో కండోమ్‌ల వినియోగం భారీగా తగ్గిపోయింది.

అయితే.. అసురక్షిత శృంగారం వైపు ఎక్కువ ఆసక్తి చూపుతున్నది అమ్మాయిలేనని ఓ సర్వేలో తేలింది. 65శాతం మంది కండోమ్ వాడకుండానే.. శృంగారంలో పాల్గొంటారని ఓ అధ్యయనం వెల్లడించింది.

మగావాళ్లతో పోలిస్తే.. ఆడవాళ్లు అసురక్షిత శృంగారం లో పాల్గొంటున్నట్లు తేలింది. అమెరికాతోపాటు యూరప్ లోని పలు దేశాల్లో మగువలకు కండోమ్ కన్నా.. గర్భం రాకుండా  పిల్స్ వేసుకోవడం నయమని భావిస్తున్నట్లు తేలింది. అమెరికాలో 36శాతం, యూరప్ లో 20శాతం మంది మగవలు అసురక్షిత శృంగారంలో పాల్గొంటున్నట్లు సమాచారం. ఈ విషయంలో అమ్మాయిలకన్నా.. అబ్బాయిలే కాస్త బెటర్ గా ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. 

loader