హెల్తీ రూల్స్ పాటిస్తే క్రమం తప్పకుండా ఫిట్‌నెస్!

Without joining gym, this guy lost 15 kilos in just 3 months with diet and home work outs
Highlights

జిమ్‌కు వెళ్లకుండానే మూడు నెలల్లో 15 కిలోల బరువు తగ్గించుకోవచ్చు. 

మీరు 20వ పడిలో ఉన్నారా.. అయితే ఈ వయస్సులోనే మీ శరీరంలో కొవ్వు పెరిగిపోతే మీ విశ్వాసం సన్నగిల్లడం ఖాయం. ఎందుకంటే శరీరాన్ని, ఆరోగ్యాన్ని అదుపులో పెట్టుకోవాలంటే కష్టపడి పని చేయాలి. తిండి విషయంలోనూ కఠినంగా ఉండాలి. ప్రత్యేకించి ఐటీ రంగంలో సేవలందిస్తున్న యువత ఈ పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. నిర్దేశిత నిబంధనలు, పద్ధతుల అమలులో ఒక్క రోజు కూడా క్రమం తప్పకుండా పాటిస్తే జిమ్‌కు వెళ్లకుండానే మూడు నెలల్లో 15 కిలోల బరువు తగ్గించుకోవచ్చు. 

అసలే చేస్తున్నది ఐటీ కొలువు. సొమ్ములకు కొదువ లేదు. ఆకలేసినప్పుడల్లా అందుబాటులో ఉన్న తినుబండారాలు లాగించేస్తాం. అది క్రమంగా ఊబకాయానికి దారి తీస్తుంది. శరీరంలో భారీగా కొవ్వు, ప్రోటీన్ నిల్వలు పేరుకు పోతాయి. ఈ క్రమంలో ఐటీ ఉద్యోగులైనా.. ఇతర రంగాల్లో పని చేసే వారైనా తమ ఊబకాయాన్ని తగ్గించుకోవాలని భావిస్తారు. కానీ వారి ప్రేరణనిచ్చే వారు ఉండరు. వ్యక్తిగతంగా వారు సొంత నిర్ణయానికి రావాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి.


రోజంతా పని చేసి వచ్చి నిద్రపోవడానికి అలవాటు పడిన ఐటీ ఉద్యోగులు బయట రెస్టారెంట్లలో అందుబాటులో ఉన్న ఫుడ్ తినేసి వచ్చి ఏం చక్కా ఇంటికొచ్చేసి బజ్జుంటారు. మరుసటి రోజు ఉదయమే లేచి గబగబా పరుగెడతారు. ఇలా రెండేళ్లు గడిచేలోపే శరీరం బరువు భరించలేనంత ఎక్కువగా పెరుగుతుంది. ఇటువంటి పరిస్థితుల్లో ఊబకాయంతో బాధపడుతున్న వారు కుటుంబ సభ్యుల మద్దతుతో విపత్కర పరిస్థితుల నుంచి బయటపడేందుకు మార్గాలు అన్వేషించాల్సి ఉంటుందని పౌష్టికాహార నిపుణులు చెబుతున్నారు. బరువు తగ్గించుకోవడంపై ద్రుష్టి సారించిన వారు ఎల్లవేళలా ఆ లక్ష్య సాధనపైనే ఫోకస్ చేయాలని సూచిస్తున్నారు. 

ఉదయం వేళ ఒక వెజ్ కర్రీతో 100 గ్రాముల బ్రౌన్ రైస్ అల్ఫాహారం తీసుకుంటే సరి. రెండు గంటల తర్వాత ఇంటిల్లో వెన్నతో రోస్ట్ చేసిన వేరుశనగలు టేబుల్ స్పూన్, పది బాదం పలుకులు, 4 ఆక్రుట్లు తీసుకుంటే సరి. మధ్యాహ్నం వీలైతే మాంసహారంతోపాటు ఐదు చిన్న చపాతీలు, ఒక వెజ్ కర్రీతో లంచ్ ముగించాలి. సాయంత్రం వేళ ఫలాల మిక్స్ తీసుకుంటే సరి. రాత్రి తిరిగి ఒక వెజ్ కర్రీతో ఐదు చిన్న చపాతీలు, రెండు కోడిగుడ్లు (వైట్)తో డిన్నర్ క్లోజ్ చేసేయాలి. 

శరీరంలోని అన్ని భాగాల్లో వేడిని పెంపొందిస్తే సహజంగానే కొవ్వు పదార్థాలు కరిగిపోతాయి. సరైన డైట్ తీసుకుంటూ ఉంటే కొవ్వు తగ్గిపోవడంతోపాటు కండరాలు బలోపేతం అవుతాయి. అదే సమయంలో ప్రతి రోజూ ఏడు నుంచి ఎనిమిది గంటల పాటు పూర్తిగా ప్రశాంతంగా నిద్ర పోవాలి సుమా. ఐటీ ఉద్యోగుల నుంచి ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో పని చేసే వారెవ్వరైనా సరే డైట్ ప్లాన్, వ్యాయామం ప్లాన్ క్రమం తప్పకుండా పాటిస్తూ ఉంటే ఊబకాయం దానంతట అదే దిగి వస్తుంది. 

ఊబకాయం సమస్య నుంచి బయటపడి ఫిట్ నెస్ సాధించాలంటే గతంలో పుస్తకాలపైనే ఆధారపడే వారం. కానీ అరచేతిలోకి ఇంటర్నెట్ అందుబాటులోకి వచ్చింది. వీడియోల్లో పరిష్కార మార్గాలు లభిస్తున్నాయి. వాటిని క్షుణ్ణంగా పరిశీలించి, పరిస్థితులకు అనుకూలంగా ప్రణాళిక రూపొందించుకుని అమలు చేస్తే సరి.. ఊబకాయం దానంతట అదే తగ్గుతుంది. 

ఈ ఆహార నియమాల అమలులో ఒక్కరోజు కూడా వెనుకడుగు వేయకూడదు. కార్బోహైడ్రేట్లు తక్కువగా తీసుకుంటూ ఎక్కువగా ప్రోటీన్లు, బలవర్ధక పదార్థాలు తీసుకుంటూ ఉండాలి. పూర్తిగా శరీరాన్ని అదుపులోకి తెచ్చేందుకు వారంలో ఆరు రోజుల పాటు వ్యాయామం చేస్తూనే ఉండాలి. తక్కువ క్యాలరీలు ఉన్న ఆహారాన్ని తీసుకోవాల్సి వస్తే గ్రీన్ సలాడ్, ఓట్ మీల్‌కు ప్రాధాన్యం ఇవ్వాలని పౌష్టికాహార నిపుణులు అంటున్నారు. 
 

loader