బాత్రూమ్ లో ఎక్కువ సేపు ఎందుకు ఉంటారో తెలిస్తే నోరెళ్లబెడతారు

చాలా మంది బాత్రూమ్ లో చాలా సేపు ఉంటారు. అసలు అంత సేపు ఏం చేస్తారని చాలా మంది అడిగేస్తుంటారు. కానీ వారి నుంచి చిన్న నవ్వు తప్ప ఏ సమాధానం రాదు. కానీ తాజా అధ్యయనంలో ఈ సీక్రేట్ ఏంటో బయటపడింది. 

why some people spend more time in bathroom new study reveals reasons rsl

స్నానం చేయడం నుంచి బట్టలు ఉతకం వరకు బాత్రూమ్ ను మనం ఎన్నో ప్రాథమిక అవసరాలకు ఉపయోగిస్తుంటాం. కానీ నేటి కాలంలో చాలా మంది బాత్రూమ్ లో గంటలకు గంటలు గడుపుతుంటారు. అరే ఇంతసేపు ఏం చేశావురా అని అడిగిన సందర్బాలు చాలా మందికి ఎదురయ్యే ఉంటాయి. నిజానికి కొంతమంది బాత్రూమ్ ను స్వర్గంగా భావిస్తారట. అందుకే అందులో  చాలా సేపటి వరకు ఉంటారు. 

బాత్రూమ్ లో టైం పాస్ చేయడమేంటని చాలా మంది ముఖం అదోలా పెడుతుంటారు. కానీ చాలా మందికి ఇదొక పీస్ ఫుల్ ప్లేస్ అనే చెప్పాలి.ముఖ్యంగా జీవితంలో కష్టమైన సమయం వచ్చినప్పుడు లేదా తమకంటూ కొంత సమయాన్ని కేటాయించాలనుకునే వారు చాలా సేపు బాత్రూమ్ లో ఉంటారట. దీనివల్ల బాత్రూంలో ఎక్కువ సమయం గడిపే వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతోందని నిపుణులు అంటున్నారు.

బాత్రూంలో స్నానాలు చేయడమే కాకుండా.. కొంతమంది బాత్రూమ్ లో పాటలు పాడటం, డ్యాన్సులు చేయడం వంటి ఎన్నో పనులను కూడా చేస్తుంటారు. అంతెందుకు ఇలా చాలా సేపటి వరకు బాత్ రూం ఉండే అలవాటు మనలో చాలా మందికి కూడా ఉండొచ్చు. నిజానికి ఇది చెడ్డ అలవాటేం కాదు. 

why some people spend more time in bathroom new study reveals reasons rsl

అయితే ఇలా చాలా మంది ఎందుకు బాత్రూంలో ఎక్కువ సేపు ఉంటారనే దానిపై ఒక అధ్యయనం జరిగింది. ఈ అధ్యయనంలో బాత్రూమ్ లో ఎక్కువ సేపు ఉండే వారు దీనికి ఎన్నో కారణాలు చెప్పారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 

విల్లేరాయ్ అండ్ బోచే అనే సంస్థ బాత్రూం ను ఎక్కువ సేపు ఉపయోగించడంపై అధ్యయనం నిర్వహించింది. ఈ అధ్యయనంలో 2,000 మందికి పైగా పాల్గొన్నారు. అయితే వీరిలో 43 శాతం మంది శాంతి, ప్రశాంతత కోసం బాత్రూమ్ లో ఎక్కువ సేపు ఉంటున్నట్టు చెప్పారు. వీళ్లు వారానికి దాదాపుగా గంటా 54 నిమిషాలు లేదా నెలకు ఒక పనిదినం బాత్రూమ్ లో గడుపుతున్నారట. 

అయితే ఇక్కడొక ఇంట్రెస్టింగ్ విషయం ఉంది. అదేంటంటే.. ఆడవాళ్ల కంటే మగవారే ఎక్కువ సేపు బాత్రూమ్ లో గడుపుతున్నారట. ఆడవాళ్ల కంటే అన్ని వయసుల పురుషులు టాయిలెట్ లో చాలా సమయం గడుపుతున్నారని అధ్యయనంలో తేలింది. పురుషులు వారానికి ఏకంగా 2 గంటలు లేదా దాదాపుగా 20 నిమిషాలు టాయిలెట్లో గడుపుతున్నారట. ఆడారురోజుకు 15 నిమిషాలు, వారానికి 1 గంట 54 నిమిషాలు బాత్రూంలో గడుపుతున్నారట. 

బాత్రూం లోకి ఒత్తిడిని తగ్గించుకోవడానికి కూడా వెళతారట. ఈ అధ్యయనం ప్రకారం.. బాత్రూంలో ఎక్కువ సేపు ఉండటం వల్ల  ఒత్తిడి తగ్గి మానసిక ఆరోగ్యంపై సానుకూల ప్రభావం పడుతుంది. అయితే బాత్రూమ్ లో ఎక్కువ సమయాన్ని గడిపే కొంతమందికి ఒత్తిడికి లోనవుతున్నట్టు గుర్తించలేకపోతున్నారు. 

బ్రిటీష్ అసోసియేషన్ ఫర్ కౌన్సిలింగ్ అండ్ సైకోథెరపీ సభ్యురాలు జార్జినా స్టర్మర్ మాట్లాడుతూ.. చాలా మంది బాత్రూమ్ ను అన్నింటి నుంచి తప్పించుకోవడంగా భావిస్తారు. జీవితం బిజీ బిజీగా, ఫాస్ట్ గా వెళుతున్న సమయాల్లో ప్రతి ఒక్కరికీ కోపింగ్ మెకానిజమ్స్ అవసరం. ఇందుకు బాత్రూమ్ నే మంచి ప్లేస్ గా భావిస్తారు. అందుకే బాత్ రూం లో బ్రేక్ తీసుకోవడానికి ఇష్టపడతారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios