Asianet News TeluguAsianet News Telugu

గ్రీన్ టీ తాగితే మంచిదే.. కానీ ఎప్పుడు తాగాలి?

ఈ రెండు సమయాల్లో గ్రీన్ టీ తాగడం వల్ల శరీర మెటబాలిజం పెరిగి క్యాలరీలు వేగంగా ఖర్చవుతాయి. బరువు తగ్గేందుకు అవకాశం ఉంటుంది.

When should I drink green tea for weight loss?
Author
Hyderabad, First Published Aug 21, 2018, 2:29 PM IST

గ్రీన్ టీ ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ విషయం మనందరికీ తెలుసు. గ్రీన్ టీ తాగడం వల్ల శరీర బరువు తగ్గుతారు. ఇది కూడా మీకు తెలిసే ఉండొచ్చు. కానీ.. ఎప్పుడు పడితే అప్పుడు తాగితే.. బరువు తగ్గడం విషయాన్ని పక్కన పెట్టి.. ఇతర ఆరోగ్య సమస్యలు వచ్చిపడతాయి. చాలా మంది బరువు తగ్గుతాం కదా.. అని ఎక్కువసార్లు గ్రీన్ టీ తాగడం లేదా.. ఎప్పుడు పడితే అప్పుడు తాగేస్తుంటారు. అది చాలా తప్పు అంటున్నారు నిపుణులు. మరి రోజుకి ఎన్ని కప్పుల గ్రీన్ టీ మంచిది..? అది కూడా ఏ సమయంలో తాగడం ఉత్తమం ఇప్పుడు తెలుసుకుందాం...

గ్రీన్ టీని ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల లోపు తాగాలి. దీని వల్ల శరీర మెటబాలిజం పెరుగుతుంది. సాయంత్రం 4 నుంచి 6 గంటల సమయంలోనూ గ్రీన్ టీని తాగవచ్చు. ఈ రెండు సమయాల్లో గ్రీన్ టీ తాగడం వల్ల శరీర మెటబాలిజం పెరిగి క్యాలరీలు వేగంగా ఖర్చవుతాయి. బరువు తగ్గేందుకు అవకాశం ఉంటుంది. ఇక గ్రీన్ టీని ఉదయాన్నే ఖాళీ కడుపుతో అస్సలు తాగరాదు. అలా తాగితే లివర్‌పై గ్రీన్ టీ హానికర ప్రభావాన్ని చూపిస్తుంది.

రక్తహీనత సమస్య ఉన్న వారు భోజనం చేశాక 2 గంటల తరువాత గ్రీన్ టీ తాగాలి. లేదంటే శరరీం ఐరన్‌ను గ్రహించలేదు. దీంతో సమస్య మరింత ఎక్కువవుతుంది. అలాగే నిద్రపోయే ముందు కూడా గ్రీన్ టీ తాగరాదు. గ్రీన్ టీ వల్ల నిద్ర అస్తవ్యస్తమవుతుంది. నిద్రలేమి సమస్య వస్తుంది. అందుకని రాత్రి పూట గ్రీన్ టీ తాగరాదు. రోజుకు 2 లేదా 3 కప్పుల గ్రీన్ టీని తాగవచ్చు. అంతకు మించి తాగితే శరీరం మనం తిన్న ఆహారం నుంచి పోషకాలను సరిగ్గా గ్రహించలేదు. దీని వల్ల పోషకాహార లోప సమస్య వస్తుంది. కనుక గ్రీన్ టీని పైన సూచించిన సమయాల్లో తాగితేనే మంచిది

Follow Us:
Download App:
  • android
  • ios