Asianet News TeluguAsianet News Telugu

శృంగారానికి ముందు అస్సలు చేయకూడని పనులివి

శృంగారం విషయంలో దంపతులు ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి అంటున్నారు నిపుణులు. ముఖ్యంగా స్త్రీలు మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అలా జాగ్రత్తలు తీసుకోకుంటే అనారోగ్యం భారిన పడి ఇబ్బంది పడాల్సిందేనని హెచ్చరిస్తున్నారు.

What To Do When You Have To Pee Before coupling
Author
Hyderabad, First Published Aug 28, 2019, 4:29 PM IST


శృంగారమనేది జీవితంలో అతి ముఖ్యమైన భాగం. దంపతుల దాంపత్య జీవితం ఆనందంగా, సాఫీగా సాగేందుకు ఇది కీలక పాత్ర పోషిస్తుంది. మరో ప్రాణి భూమి మీదకు రావాలంటే ఇది తప్పనిసరి. అలాంటి శృంగారం విషయంలో దంపతులు ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి అంటున్నారు నిపుణులు. ముఖ్యంగా స్త్రీలు మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అలా జాగ్రత్తలు తీసుకోకుంటే అనారోగ్యం భారిన పడి ఇబ్బంది పడాల్సిందేనని హెచ్చరిస్తున్నారు.

సాధారణంగా శృంగారం వల్ల మహిళలకు మూత్రాశయ ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే సెక్స్ లో పాల్గొన్న తర్వాత స్త్రీల యోని భాగం వద్ద బ్యాక్టీరియా చేరి అలాగే ఉండిపోతుంది. రతి అనంతరం ఆ బ్యాక్టీరియా యోని వద్ద నుంచి మూత్రాశయ ద్వారం వద్దకు వస్తుంది. ఆ సమయంలో తప్పనిసరిగా మూత్ర విసర్జన చేయాలి.

శృంగారం తర్వాత మూత్ర విసర్జన చేస్తే.. ఆ బ్యాక్టీరియా మూత్రంతో పాటు బయటకు పోతుంది. అలా కాకుండా చాలా మంది రతి క్రీడలో పాల్గొనడానికి ముందే మూత్రవిసర్జన చేస్తారు. అలా చేస్తే.. ఆ తర్వాత మూత్రం రాదు. దీంతో బ్యాక్టీరియా అక్కడే ఉండిపోయి..  ఇన్ఫెక్షన్ కి దారి తీస్తుంది. అంతేకాదు.. మూత్ర విసర్జన చేసిన తర్వాత కూడా స్త్రీలు కచ్చితంగా నీటితో జననాంగాలను శుభ్రం  చేసుకోవాలి. కేవలం స్త్రీలే కాదు... పరుషులు కూడా శుభ్రం చేసుకోవాలి. ఇలాంటి జాగ్రత్తలు తీసుకోకపోతే... లేనిపోని ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. 

Follow Us:
Download App:
  • android
  • ios