రంజాన్ ఉపవాసం ఉంటున్నారా? డయాబెటీస్ పేషెంట్లే కాదు మిగతా వారు కూడా చిట్కాలను పాటించాల్సిందే..!
Ramadan 2023: సాధారణంగా పగటిపూట టీ, కాఫీ వంటి కెఫిన్ పానీయాలను తాగేవారికి ఆకలి ఉండదు. కానీ విపరీతమైన ఆకలి కలుగుతుంది. అంతేకాదు ఈ పానీయాలు అలసటకు దారితీస్తాయి.

Ramadan 2023: ఇస్లామిక్ క్యాలెండర్ లో తొమ్మిదో నెల అయిన పవిత్ర రంజాన్ మాసంలో.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లింలంతా ఉపవాసం ఉంటారు. ఈ నెలంతా ముస్లింలు పగటిపూట ఏమీ తినరు.. తాగరు. సూర్యోదయానికి ముందు ఒకసారి భోజనం చేస్తారు. దీన్ని సుహూర్ లేదా సెహ్రీ అంటారు. సూర్యాస్తమయం తర్వాత కూడా ఒక సారి భోజనం చేస్తారు. దీన్ని ఇఫ్తార్ అంటారు.
రంజాన్ సమయంలో ఉపవాసం చేసేవారు గుర్తుంచుకోవాల్సిన విషయాలు
నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఉపవాస సమయంలో ఆహారం లేదా పానీయాలను పూర్తిగా తీసుకోకపోవడం వల్ల మీ శరీరం కాలేయం, కండరాల నుంచి కార్భోహైడ్రేట్లను, కొవ్వు నిల్వలను ఉపయోగిస్తుంది.
నిపుణుల ప్రకారం.. రంజాన్ సమయంలో ఉపవాసం చేసే వారి శరీరం డీహైడ్రేట్ అయ్యే అవకాశం ఉంది. దీనివల్ల తలనొప్పి, అలసట, ఏకాగ్రతలో ఇబ్బంది వంటి సమస్యలు వస్తాయి. అయితే ఉపవాసాన్ని విరమించిన తర్వాత పగటిపూట కోల్పోయిన పోషకాలను భర్తీ చేయడానికి తగినంత ద్రవాలను తీసుకోవాలి. దీనివల్ల ఆరోగ్యానికి ఎలాంటి హాని జరగదని అధ్యయనాలు సూచిస్తున్నాయి. అయినప్పటికీ.. ఉపవాసం సమయంలో మైకంగా అనిపించి నిలబడటానికి కూడా చేతకాకపోతే మితమైన పరిమాణంలో నీటిని క్రమం తప్పకుండా తాగండి. చక్కెర, ఉప్పుతో పానీయాన్ని తయారుచేసుకుని తాగండి. ఇది మిమ్మల్ని హైడ్రేట్ చేస్తుంది.
సాధారణంగా పగటిపూట టీ, కాఫీ వంటి కెఫిన్ పానీయాలు తీసుకునేవారికి ఉపవాసం సమయంలో ఆకలి కాదు. కానీ తలనొప్పి, అలసట వంటి సమస్యలు వస్తాయి. అందుకే కెఫిన్ వంటి పానీయాలకు దూరంగా ఉండాలని నిపుణులు అంటున్నారు.
ఉపవాసం విరమించిన తర్వాత శరీరం రీహైడ్రేట్ అవుతుంది. మీరు తీసుకునే ఆహారాలు, పానీయాల నుంచి శక్తి అందుతుంది. అయితే ఉపవాసాన్ని విరమించిన తర్వాత నెమ్మదిగా తినాలి. ద్రవాలను పుష్కలంగా తాగాలి. తక్కువ కొవ్వు, ద్రవాలు ఎక్కువగా ఉండే ఆహారాలను సుహూర్ సమయంలో తీసుకుంటే ఆరోగ్యం బాగుంటుంది.
పుష్కలంగా ద్రవాలను తాగడం, అలాగే పండ్లు, కూరగాయలు, పెరుగు, సూప్ లు ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం వల్ల మీరు హెల్తీగా ఉంటారు. ఇది మీరు పగటిపూట కోల్పోయిన ద్రవాలను భర్తీ చేయడానికి, మరుసటి రోజు ఉపవాసంలో మీరు హైడ్రేట్ గా ఉండటానికి సహాయపడుతుంది. హైడ్రేట్ గా ఉండాలంటే ఉప్పు ఎక్కువగా ఉండే ఆహారాలను అసలే తినకూడదు. ఇఫ్తార్ విందులో డీప్ ఫ్రైడ్, క్రీమీ, స్వీట్ ఫుడ్స్ ను ఎక్కువగా తీసుకుంటే రంజాన్ సమయంలో బరువు పెరుగుతారు. దీనివల్ల మీరు అంత సులువుగా బరువు పెరగరు.
అయినప్పటికీ.. ఆహారపు అలవాట్లలో మార్పులు, పగటిపూట ద్రవాలను తీసుకోకపోవడం వల్ల కొంతమందికి మలబద్దకం సమస్య కూడా వస్తుంది. అందుకే ఇఫ్తార్ విందులో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండే తృణధాన్యాలు, బ్రాన్, పండ్లు , కూరగాయలు, బీన్స్, కాయధాన్యాలు, డ్రై ఫ్రూట్స్, గింజలను పుష్కలంగా తినండి. ఇది మలబద్దకాన్ని తగ్గించడానికి సహాయపడుతుంది. ఇఫ్తార్ వింధు తర్వాత కాసేపు నడవండి. తేలికపాటి శారీరక శ్రమను ఫుడ్ బాగా జీర్ణం అయ్యేందుకు సహాయపడుతుంది.
మధుమేహ వ్యాధిగ్రస్తులు గుర్తుంచుకోవాల్సిన విషయాలు
- డయాబెటీస్ పేషెంట్లు తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ భోజనాన్నే తినాలి. అంటే భోజనంలో ప్రోటీన్లు, సహజ కొవ్వులు, ఫైబర్, బియ్యం, రోటీ వంటి తృణధాన్యాలు ఉండాలి.
- మైదా, వైట్ షుగర్, వైట్ బ్రెడ్ వంటి ప్రాసెస్ చేసిన ఆహార పదార్థాలను ఎక్కువగా తినకండి.
- ఖర్జూరంతో ఉపవాసాన్ని విరమించే సంప్రదాయం మీ ఆరోగ్యానికి చాలా మంచిది. మీరు మీ డెజర్ట్ లల్లో కూడా ఖర్జూరాలను స్వీటెనర్ గా ఉపయోగించొచ్చు. ఇది మొత్తం గ్లైసెమిక్ సూచికను తగ్గిస్తుంది. అంతేకాదు మీ శరీరానికి అవసరమైన ఖనిజానికి కూడా అందిస్తుంది.
- మీ భోజనంలో ఎక్కువ మొత్తంలో కూరగాయలు ఉండేలా చూసుకోండి.
- ఇది సాధ్యం కాకపోవచ్చు. సన్నని మాంసాలు, సీఫుడ్ నే ఎక్కువగా తీసుకోవడానికి ప్రయత్నించండి.